Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో కోసం మాస్ సంచ‌ల‌నం వెయిటింగ్!

మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన‌ బోయపాటి శ్రీను ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   15 July 2026 1:00 PM IST
ఆ స్టార్ హీరో కోసం మాస్ సంచ‌ల‌నం వెయిటింగ్!
X

మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన‌ బోయపాటి శ్రీను ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తనదైన పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. ఆయన కెరీర్‌లోని భారీ హిట్స్ అన్నీ కూడా అగ్రనటుల ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లినవే కావడంతో కొత్త కలయికపై ఆసక్తి నెలకొంది. అయితే భారీ ప్రాజెక్టును పట్టా లెక్కించడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే? బోయపాటి అనుకుంటున్న అగ్ర నటుడు ప్రస్తుతం తదుపరి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాదిన్నర వరకు ఆ హీరో డేట్లు అందుబాటులో లేవని సమాచారం. ప్రతిష్టాత్మక చిత్రాలు, పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఆ నటుడు బిజీ చూస్తుంటే బోయపాటి సినిమాను మొదలుపెట్టాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పని పరిస్థితి క‌నిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆ అగ్రనటుడితో బోయ‌పాటి ప్రాథమిక చర్చలు జరిపినట్లు కథాంశంపై కూడా అవగాహనకు వచ్చినట్లు టాక్. బోయపాటి శైలి యాక్షన్ ఎలిమెంట్స్ ఆ హీరో ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతున్నాయ‌ని.. అందుకే ప్రాజెక్టుపై ఆ హీరో కూడా ఆసక్తిగానే ఉన్నాడ‌ని తెలుస్తోంది.

కానీ నిరంతర షూటింగ్ షెడ్యూల్స్ .. ఇతర కమిట్‌మెంట్లు కాంబినేషన్ ఆలస్యానికి కారణమవుతున్నాయి. టాలీవుడ్‌లో అగ్రనటుడితో బోయపాటి సినిమా అంటే? అది కచ్చితంగా భారీ బడ్జెట్‌తోనే ఉంటుంది. అలాంటి భారీ ప్రాజెక్టును హడావిడిగా కాకుండా? ప‌క్కాగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రారంభిం చాలని బోయపాటి భావిస్తున్నారు. ఆ హీరో డేట్లు దొరకడమే ఇప్పుడున్న ఏకైక అడ్డంకి. ఏదేమైనా? ఈ కలయిక కుదిరితే మాత్రం అభిమానులకు మరో మాస్ జాతర ఖాయం. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికిఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఈలోగా బోయపాటి శ్రీను వేరే ప్రాజెక్టులను చూసుకుంటారా? లేక అగ్రనటుడి కోసం ఎదురు చూస్తూ కథను మరింత పదును పెడతారా? అనేది చూడాలి. సాధారణంగా దర్శ కులు హీరోల‌ కోసం ఎక్కువ కాలం వేచి చూడ‌రు. కానీ ఆ స్థాయి హీరో దొరికితే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. బోయపాటి విషయంలో కూడా ఇదే జరుగుతుందని అభిమానులు ఆశీస్తున్నారు. అయితే బోయ‌పాటి ఈసారి ఎలాంటి జాన‌ర్ తో వ‌స్తున్నారు? పాన్ ఇండియా క్రేజ్ న‌డుమ ఎలాంటి పాయింట్ ను తీసుకుంటున్నారు? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రంగా మారింది. బాల‌య్య `అఖండ‌2` ని పాన్ ఇండియాలో రిలీజ్ చేసినా? అది అంచ‌నాలు అందుకో వ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి మూల క‌థ‌పై ఆస‌క్తి నెలకొంది.