Begin typing your search above and press return to search.

అఖండ-2 సినిమా కాదు.. ఇండియా ఆత్మ‌!-బోయ‌పాటి

అఖండ 2 ఈవెంట్ లో బోయ‌పాటి శ్రీ‌ను మాట‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. హిందూ స‌నాత‌న ధ‌ర్మంపై ఇది ప్ర‌త్యేక‌మైన సినిమా అని అత‌డి వ్యాఖ్య‌లు చెబుతున్నాయి.

By:  Sivaji Kontham   |   14 Nov 2025 9:40 PM IST
అఖండ-2 సినిమా కాదు.. ఇండియా ఆత్మ‌!-బోయ‌పాటి
X

``ఇది ఒక సినిమా కాదు.. ఇది ఇండియాకు ఆత్మ‌.. ప‌ర‌మాత్మ‌.. ఇండియాకు ధ‌ర్మం.. ధైర్యం.. ఇదే మా సినిమాకి మూలం`` అని అన్నారు దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. నందమూరి బాలకృష్ణ క‌థ‌నాయ‌కుడిగా బోయ‌పాటి తెర‌కెక్కించిన `అఖండ 2- తాండవం` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టి. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇది బహు భాషలలో విడుదల కానుంది. తాజాగా మొదటి సింగిల్ `తాండవం`ను ముంబైలోని PVR జుహులో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

బోయ‌పాటి ఇంకా మాట్లాడుతూ..తాను ఎన‌ర్జిటిక్ గా ఉండే డైనమైట్ ఎన్బీకే తో పని చేస్తూనే ఉంటానని పేర్కొన్నాడు. ఇంత పెద్ద స్టార్‌తో అనుబంధం కలిగి ఉండటం తనకు గర్వంగా ఉందని బోయ‌పాటి అన్నారు. అఖండ- 2 కథ వేదాల గొప్పతనం, హిందూ సనాత‌న ధర్మం గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రతి భారతీయుడికి న‌చ్చుతుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు.

అఖండ 2 ఈవెంట్ లో బోయ‌పాటి శ్రీ‌ను మాట‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. హిందూ స‌నాత‌న ధ‌ర్మంపై ఇది ప్ర‌త్యేక‌మైన సినిమా అని అత‌డి వ్యాఖ్య‌లు చెబుతున్నాయి. నిజానికి అఖండ చిత్రం విడుద‌లైన‌ప్పుడు అభిమానుల‌తో పాటు, కామన్ ఆడియెన్ కి బాగా క‌నెక్ట‌యిన ఎలిమెంట్ హిందూ స‌మాజ ధ‌ర్మం. ఇప్పుడు బోయ‌పాటి దీనిని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎన్బీకేకు సింహా, లెజెండ్ లాంటి అద్భుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన బోయ‌పాటి శ్రీ‌ను ఇప్పుడు మ‌రో భారీ హిట్ ఇస్తార‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్బీకే పోస్ట‌ర్లు ఆస‌క్తిని పెంచాయి. ఈ చిత్రంలో అఘోరా పాత్ర‌లో బాల‌య్య న‌ట‌విశ్వ‌రూపాన్ని వీక్షించే ఛాన్సుంద‌ని కూడా చెబుతున్నారు. ఇప్పుడు పాట‌లు కూడా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. 14 రీల్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది. ఎస్.ఎస్.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే డ‌బ్బింగ్ పూర్త‌యింది. ఇత‌ర నిర్మాణానంత‌ర ప‌నుల్ని పూర్తి చేసి డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు.