నాకు ఊపిరి.. బాబుకు ఓపిక ఉన్నంత వరకూ: బోయపాటి
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` డిసెంబర్ 5న అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.
By: Sivaji Kontham | 18 Nov 2025 10:21 PM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` డిసెంబర్ 5న అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్బీకే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్‌గా వేచి చూస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ `అఖండ`కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య బాబు మాస్ విశ్వరూపాన్ని చూడబోతున్నామని ఇప్పటికే బోయపాటి శ్రీను సంకేతం ఇచ్చాడు.
ఇటీవల ముంబైలో మొదటి పాట `ది తాండవం`ను విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు రెండవ సింగిల్ `జాజికాయ జాజికాయ`ను ఇప్పుడు వైజాగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేసారు. ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన ఈ పాటను శ్రేయ ఘోషల్ -బ్రిజేష్ శాండిల్య పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటకు బాలయ్య మాస్ స్టెప్స్, సంయుక్త మీనన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఒక భారీ సెట్ లో దీనిని విజువల్ రిచ్ గా చిత్రీకరించారు.
ఈవెంట్లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. నటసింహా నందమూరి బాలకృష్ణ స్టెప్పులను హైలైట్ చేసారు. ఆయన మాట్లాడుతూ.. క్యాప్ ఊపినా మీరే.. చెయ్యి ఊపినా మీరే అంటూ వేదికపై నవ్వులు పూయించారు. నాకు ఊపిరి ఉన్నంతవరకూ.. బాబుకు ఓపిక ఉన్నంతవరకూ మా కాంబినేషన్ సినిమా నడుస్తూనే ఉంటుంది..కలిసి పని చేస్తూనే ఉంటామని కూడా బోయపాటి అన్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. `బజరంగీ భాయిజాన్` ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఓ కీలక పాత్రధారి. డిసెంబర్ 5న అత్యంత భారీగా ఈ సినిమా విడుదల కానుంది.
