అఖండ 2 కోసం పవర్ఫుల్ సపోర్ట్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియెన్స్ కి పండగ. 'అఖండ 2' విడుదలకు ముందు నుంచి హైప్ క్రియేట్ చేసుకున్న విషయం.
By: M Prashanth | 14 Dec 2025 9:24 AM ISTనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియెన్స్ కి పండగ. 'అఖండ 2' విడుదలకు ముందు నుంచి హైప్ క్రియేట్ చేసుకున్న విషయం. ఇక గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. దీంతో బాలయ్య కెరీర్ లోనే ఇది బెస్ట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
లెక్కల విషయానికి వస్తే.. గతంలో బాలయ్య నటించిన 'డాకు మహారాజ్' సినిమా 51 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండేది. ఇప్పుడు 'అఖండ 2' ఆ రికార్డును మొదటి రోజే ఈజీగా క్రాస్ చేసేసిందని చెబుతున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా ఓపెనింగ్స్ 59.5 కోట్ల వరకు వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సగం విజయం సాధించిన ఈ సినిమా, కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం బాలయ్య క్రేజ్ తోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకు వచ్చిన ఒక స్పెషల్ రెస్పాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ సినిమా కాన్సెప్ట్ ను మెచ్చుకున్నారు. ఈ సినిమాలో చూపించిన దేశం, ధర్మం, దైవం అనే పాయింట్స్ నేటి తరానికి చాలా అవసరమని ఆయన అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుని ప్రత్యేకంగా కలిసి అభినందించడం, సినిమా విజయం సాధించాలని కోరుకోవడం నిజంగా విశేషం.
దీనిపై దర్శకుడు బోయపాటి కూడా స్పందించారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా.. ఈ జనరేషన్ కు మన సంస్కృతి, విలువలు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశానని చెప్పారు. మోహన్ భగవత్ లాంటి పెద్దల నుంచి ప్రశంసలు రావడం తమ టీమ్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని, బాధ్యతను మరింత పెంచిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మీటింగ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ గట్టిగా చేశారు. ఈ మధ్య హిందీ ఆడియెన్స్ దైవభక్తి, హిందూ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మోహన్ భగవత్ ప్రశంసలు తోడవ్వడంతో, నార్త్ లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి 'అఖండ 2' రెండు విధాలుగా మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. ఒకపక్క నిర్మాతలకు కావాల్సిన భారీ కలెక్షన్స్ వస్తున్నాయి, మరోపక్క సినిమాకు ప్రముఖుల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. మరి ఈ పాజిటివ్ వైబ్స్ సినిమాను లాంగ్ రన్ లో ఎక్కడి వరకు తీసుకెళ్తాయో చూడాలి.
