మొదటి రెమ్యూనరేషన్ పై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బోయపాటి!
బోయపాటి శ్రీను.. దర్శకుడిగా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్ల లిస్టులో ఈయన పేరు కూడా ఉంటుంది.
By: Madhu Reddy | 28 Oct 2025 12:00 AM ISTబోయపాటి శ్రీను.. దర్శకుడిగా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్ల లిస్టులో ఈయన పేరు కూడా ఉంటుంది. అయితే అలాంటి ఈ డైరెక్టర్ మొదటి సినిమా భద్ర అనే సంగతి అందరికీ తెలిసిందే. రవితేజ హీరోగా నటించిన భద్ర మూవీ మొదట అల్లు అర్జున్ తో చేయాల్సింది. కానీ అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్ కి ఇలాంటి సినిమా సెట్ అవ్వదని.. ఒకవేళ చేస్తే ఆ తరువాత అల్లు అర్జున్ కి లవ్ స్టోరీస్ సెట్ అవ్వవు అని భావించిన అల్లు అరవింద్ బన్నీతో కాకుండా మరో హీరోతో చేయమని దిల్ రాజ్ కి పరిచయం చేశారట. అలా దిల్ రాజుకి కథ బాగా నచ్చడంతో రవితేజని పెట్టి భద్ర మూవీ తెరకెక్కించారు.
అలా బోయపాటి శ్రీను డైరెక్షన్ చేసిన మొదటి మూవీ భద్ర బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, లవ్ ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులని ఫిదా చేశాయి. అయితే అలాంటి ఈ సినిమా విషయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనని బయటపెట్టారు.. గతంలో ఒక ప్రోగ్రాం లో పాల్గొన్న బోయపాటి శ్రీను బయటపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా మీ మొదటి రెమ్యూనరేషన్ ఎంత అని యాంకర్ బోయపాటిని ప్రశ్నించగా..అసలు రెమ్యూనరేషన్ ఏమీ లేదు. రాజుగారు నీకు నెలకు ఎంత అవసరం అని అడిగితే..ఒక 40 వేలు ఇవ్వమని చెప్పాను. అలా ఆయన 40వేలు ఇచ్చారు. ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు ఒక లక్ష ఇవ్వమంటే ఇచ్చారు. అలా టోటల్ గా సినిమా అయిపోయాక 5 లక్షలు చాలు కదా అంటే.. ఓకే అని చెప్పాను. అలా మూడున్నర లక్షలో.. నాలుగు లక్షలో పెట్టి ఒక కారు కొనిచ్చారు. ఒకటిన్నర లక్ష చేతికి ఇచ్చారు. అప్పటికే మొదటి సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ నాకు కూడా అడగాలి అనిపించలేదు. అలాగే ఖర్చు ఎంతైనా వెనకాడను.. సినిమా బాగా తీయాలి.. నీకు ఎంత కావాలో చెప్పు అన్నారు. కానీ నేను మాత్రం నా మీద ఖర్చు ఏమి పెట్టకండి సార్.. సినిమా మీద పెట్టండి అని చెప్పాను.
భద్ర మూవీ రైట్స్ కూడా నావే.ఎందుకంటే కథ నేనే రాసిచ్చాను.కాబట్టి ఈ కథని ఎవరికైనా అమ్మాలంటే మొదట నా సైన్ కావాలి.కానీ రాజుగారు నన్ను అడగలేదు. ఆయన రీమేక్ రైట్స్ ని అమ్మేస్తే 50% నాకే ఇవ్వాలి. కానీ నాకు చెప్పకుండానే రెండు భాషల్లో అమ్మేశారు. ఆ తర్వాత ఈ విషయం నాకు తెలిసి రాజు గారు ఏంటండీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని అడిగితే..ఆయన ఆరోజు నన్ను ఇలా అడిగారు.. నువ్వు మొదటి సినిమా చేయడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు శ్రీను నువ్వు చేసే ఈ సినిమాపై నీకు ఎలాంటి హక్కులు లేవు అని నేను కండిషన్ పెడితే నువ్వు ఆ సినిమా చేస్తావా లేదా అని అడిగారు. దానికి నేను చేస్తాను సార్ అని అన్సర్ ఇచ్చాను.ఆ తర్వాత ఇక నీ ఇష్టం ఆలోచించుకో.. నువ్ అడిగితే డబ్బులు ఇస్తానని రాజుగారు అన్నారు.దాంతో నాకు వద్దు సార్ అని చెప్పాను అంటూ బోయపాటి శ్రీను ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
దిల్ రాజు భద్ర మూవీని వేరే భాషలో అమ్మినా కూడా బోయపాటి శ్రీను డబ్బులు అడగలేదట.. దానికి కారణం బోయపాటి శ్రీనుకు దిల్ రాజు అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఆయన ఇండస్ట్రీలో అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండేవాడు కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బోయపాటి శ్రీను డబ్బులు అడగలేదట. అలా మొదలైన బోయపాటి శ్రీను ప్రస్థానం ఎన్నో హిట్ సినిమాల వరకు కొనసాగుతోంది. ఇప్పటికే బోయపాటి డైరెక్షన్లో తులసి, సింహ,లెజెండ్,సరైనోడు, అఖండ వంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈయన బాలకృష్ణతో అఖండ -2 చేస్తున్నారు.ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ విషయాలన్నీ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బోయపాటి శ్రీను తెలిపారు.
