మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. బాలయ్యపై బోయపాటి క్రష్!
నటసింహా నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేసిన బోయపాటి శ్రీను ఆయనతో అఖండ 2 కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:32 PM ISTనటసింహా నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేసిన బోయపాటి శ్రీను ఆయనతో అఖండ 2 కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. వన్ వర్డ్ లో బాలయ్యను అభివర్ణిస్తే ఏమని చెబుతారు? అనే ప్రశ్నకు `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -యూకే` వేదికపై బోయపాటి నుంచి వచ్చింది.
ఆయన సింపుల్ గా `లెజెండ్` అంటూ బాలయ్యబాబును కీర్తించారు. జై బాలయ్య! అంటూ ఉత్సాహపరిచారు. బోయపాటి మాట్లాడుతూ... మీరు మీ పనినే నమ్ముకుని ముందుకు వెళతారు. ఈ యాభై ఏళ్లలో మీరు చేసింది అదే. మిమ్మల్ని నమ్ముకుని మీరు ముందుకు వెళతారు. అవార్డులు వాటంతట అవే వస్తాయి.. అని అన్నారు.
2008లో `సింహా` వచ్చింది .17 ఏళ్లు ఈ ప్రయాణంలో మీతో ఉన్నందుకు ధన్యవాదాలు. మీకు ఓపిక ఉన్నంత వరకూ.. మాకు ఓపిక ఉన్నంత వరకూ మీతోనే.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. ఎప్పటికీ వెన్నంటే ఉంటాము.. అని బోయపాటి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
వీరసింహా రెడ్డి దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ- బాలయ్య బాబు 2.ఓ కూడా చూడబోతున్నారు అని అన్నారు. ఐ లవ్ యు బాలయ్య.. జై బాలయ్య.. అంటూ గోపిచంద్ ఉత్సాహపరిచారు. అలాగే బాలయ్య గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే...డాకు మహారాజ్ దర్శకుడు బాబి వ్యాఖ్యానిస్తూ.. ``నో ఫిల్టర్స్.. ఫిల్టర్ లెస్ హీరో`` అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో డల్లాస్ లోను జై బాలయ్య అనే మెడిసిన్ వర్కవుట్ అవుతోందని అన్నారు.
