Begin typing your search above and press return to search.

బాలయ్య 'అఖండ-2'.. బోయపాటి కొడుకు ఏ రోల్ చేశాడంటే?

అయితే డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ 2తో బోయపాటి శ్రీను చిన్న కొడుకు డెబ్యూ ఇవ్వనున్నాడు.

By:  M Prashanth   |   3 Dec 2025 12:43 PM IST
బాలయ్య అఖండ-2.. బోయపాటి కొడుకు ఏ రోల్ చేశాడంటే?
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2: తాండవం మూవీ రూపొందిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ తో సందడి మొదలు కానుంది.

అయితే డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ 2తో బోయపాటి శ్రీను చిన్న కొడుకు డెబ్యూ ఇవ్వనున్నాడు. ఇప్పటికే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తన కొడుకు వర్షిత్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు బోయపాటి శ్రీను. సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడని, అందరి బ్లెస్సింగ్స్ కచ్చితంగా కావాలని తెలిపారు.

కానీ ఏ రోల్ లో నటించాడన్న విషయంపై అప్పుడు అప్డేట్ ఇవ్వని బోయపాటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. అఖండ-2 రిలీజ్ సందర్భంగా.. ఎక్స్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో సినిమాలో భక్త ప్రహ్లాదుడిగా తన కొడుకు నటించాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

అయితే అఖండ సీక్వెల్ ట్రైలర్ ను కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మాత్రం.. భక్త ప్రహ్లాదుడి పాత్రలో వర్షిత్ కనిపిస్తాడు. అప్పుడు అతనిని ఎవరూ గుర్తించని ఆడియన్స్.. ఇప్పుడు బోయపాటి శ్రీను వెల్లడించాక స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేస్తున్నారు. ప్రహ్లాదుడిగా వర్షిత్.. తన యాక్టింగ్ తో అలా మెప్పిస్తాడో చూడాలని కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూడు చిత్రాలు కూడా బ్లాక్‌ బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రాబోయే అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారు.

సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. హర్షాలీ మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట గ్రాండ్ గా రూపొందిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు.