Begin typing your search above and press return to search.

'బోర్డర్ 2'.. అసలు రెస్పాన్స్ ఎలా ఉంది?

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై క్లాసిక్ వార్ డ్రామాకు సీక్వెల్ వచ్చేసింది. 'బోర్డర్ 2' సినిమాకు విడుదలకు ముందు నుంచే ఒక హైప్ అయితే ఉంది.

By:  M Prashanth   |   23 Jan 2026 5:43 PM IST
బోర్డర్ 2.. అసలు రెస్పాన్స్ ఎలా ఉంది?
X

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై క్లాసిక్ వార్ డ్రామాకు సీక్వెల్ వచ్చేసింది. 'బోర్డర్ 2' సినిమాకు విడుదలకు ముందు నుంచే ఒక హైప్ అయితే ఉంది. ఇక కరెక్ట్ గా రిపబ్లిక్ డే వీకెండ్ కు థియేటర్స్ లోకి దించడంతో టైమింగ్ హెల్ప్ అవుతుందని అనుకున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఉదయం షోల నుండే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది.

1997 నాటి ఒరిజినల్ 'బోర్డర్' క్రియేట్ చేసిన ఎమోషనల్ మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ అందుకోవడంలో తడబడిందని ఓ వర్గం ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కథాంశం పరంగా చూస్తే, ఇది 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. సన్నీ డియోల్ తన పవర్‌ఫుల్ వాయిస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి వంటి యంగ్ హీరోలు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, స్క్రిప్ట్ లోని బలహీనత వల్ల వారి పాత్రలు అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయని టాక్.

​ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏంటంటే 'ఒరిజినాలిటీ' లేకపోవడం. పాత 'బోర్డర్' లోని సీన్లను, అదే ఎమోషన్లను మళ్ళీ రిపీట్ చేయడానికి దర్శకుడు అనురాగ్ సింగ్ ప్రయత్నించారు. అహన్ శెట్టి సీన్లు తన తండ్రి సునీల్ శెట్టిని గుర్తు చేస్తున్నప్పటికీ, అవి కాస్త 'ఓవర్ ది టాప్' గా అనిపిస్తున్నాయనే టాక్ వచ్చింది. అలాగే పాత పాటలను మళ్ళీ రీమిక్స్ చేయడం, అదే క్లైమాక్స్ ఫైట్లను చూపించడం వల్ల నేటి జనరేషన్ ఆడియన్స్‌కు ఇది అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. ఎమోషన్స్ కూడా కొంచెం బలవంతంగా రుద్దినట్లు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

​సాంకేతికంగా సినిమా విజువల్స్ వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. యుద్ధ సన్నివేశాలను భారీగా ప్లాన్ చేశారు. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. పర్సనల్ స్టోరీస్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు మరీ సాగదీసినట్లు ఉండటంతో సినిమా వేగం నెమ్మదించింది. మ్యూజిక్ విషయంలో అను మాలిక్ పాత పాటలనే నమ్ముకోవడం వల్ల కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తోంది.

​అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. మొదటి రోజు సుమారు రూ. 30 నుండి 35 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉండటం, రిపబ్లిక్ డే వీకెండ్ రాబోతుండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తే వసూళ్లు స్టడీగా ఉండవచ్చు. కానీ లాంగ్ రన్ లో సినిమా నిలబడాలంటే ఈ మిక్స్ డ్ టాక్ ను అధిగమించాల్సి ఉంటుంది.

​ఫైనల్ గా 'బోర్డర్ 2' ఒక పాత ఫార్ములాను మళ్ళీ కొత్త బాటిల్ లో నింపినట్లు ఉందనేది మెజారిటీ ప్రేక్షకుల మాట. సన్నీ డియోల్ ఫ్యాన్స్ దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒకసారి చూడదగ్గ మూవీ అనిపించినా, క్లాసిక్ 'బోర్డర్' రేంజ్ ఇంపాక్ట్ మాత్రం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే సెలవులు ఈ సినిమాను గట్టెక్కిస్తాయో లేదో వేచి చూడాలి.