అన్నపూర్ణ స్టూడియోస్.. బోర్డర్ 2ను ఆ రేంజ్ లో..
ఆకట్టుకునే స్టోరీ, భావోద్వేగాలతో పాటు ఆ చిత్రానికి వస్తున్న మంచి రెస్పాన్స్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన అత్యున్నత స్థాయి సాంకేతిక సహకారం కావడం విశేషం
By: M Prashanth | 28 Jan 2026 10:47 PM ISTబాలీవుడ్ వార్ ఎపిక్ మూవీ బోర్డర్ 2 ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆకట్టుకునే స్టోరీ, భావోద్వేగాలతో పాటు ఆ చిత్రానికి వస్తున్న మంచి రెస్పాన్స్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన అత్యున్నత స్థాయి సాంకేతిక సహకారం కావడం విశేషం. బోర్డర్ 2కు సంబంధించిన డాల్బీ సినిమా కంటెంట్ ప్రాసెసింగ్, మాస్టరింగ్ కు సంబంధించిన కీలక పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పూర్తయ్యాయి.
ఇంటర్నేషనల్ వాల్యూస్ కు అనుగుణంగా డాల్బీ అట్మాస్ సౌండ్, డాల్బీ విజన్ టెక్నాలజీలను వినియోగించి సినిమాను సిద్ధం చేయడం వల్ల థియేటర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన ఆడియో-విజువల్ ఎక్స్పీరియన్స్ లభిస్తోంది. ప్రత్యేకంగా యుద్ధ సన్నివేశాల్లో సౌండ్ ఎఫెక్ట్స్.. ప్రేక్షకులను పూర్తిగా స్టోరీలోకి లాగుతున్నాయని చెప్పాలి. గన్ ఫైర్, పేలుళ్లు, యుద్ధ విమానాల సౌండ్స్ అన్ని దిశల నుంచి వినిపించేలా డాల్బీ ఎట్మాస్ సౌండ్ రూపుదిద్దుకుంది.
దీంతో ప్రేక్షకులు యుద్ధభూమిలో ఉన్నట్టు అనుభూతి చెందుతున్నారని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు. ఆ అనుభవానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసిన నాణ్యమైన మాస్టరింగ్ మెయిన్ రీజన్ గా నిలిచింది. అలాగే డాల్బీ విజన్ టెక్నాలజీ ద్వారా సినిమాకు మరింత క్లారిటీ, డెప్త్ వచ్చిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వెలుతురు, చీకటి మధ్య కాంట్రాస్ట్ ను బ్యాలెన్స్ చేస్తూ విజువల్స్ న్యాచురల్ గా చూపించడంలో టెక్నాలజీ కీలకంగా పనిచేసింది.
రాత్రిపూట యుద్ధ సన్నివేశాలు, పొగ, మంటల మధ్య జరిగిన పోరాటాలు స్పష్టంగా కనిపించడం వల్ల సినిమా మరింత మెప్పిస్తోంది. ప్రస్తుతం బోర్డర్ 2 ప్రదర్శితమవుతున్న థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా సౌండ్, పిక్చర్ క్వాలిటీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీంతో ఆ స్థాయి అనుభూతి వెనుక అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన టెక్నికల్ సపోర్ట్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న కొత్త టెక్నాలజీ పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నికల్ టీమ్ వల్ల ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టెక్నాలజీ వాల్యూస్ మరో మెట్టు ఎక్కాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఆడియో విజువల్ క్వాలిటీ అందించగల సామర్థ్యం మన దేశంలోనే ఉందని.. అది కూడా మన హైదరాబాద్ లోనే ఉందని బోర్డర్ 2 నిరూపించింది.
మొత్తంగా చూస్తే, బోర్డర్ 2 విజయంలో స్టోరీ, నటీనటుల యాక్టింగ్ తోపాటు అన్నపూర్ణ స్టూడియోస్ అందించిన టెక్నికల్ సపోర్ట్ కీలకంగా మారింది. మోడ్రన్ సౌండ్, విజువల్ టెక్నాలజీతో సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో స్టూడియో పాత్ర ప్రశంసనీయం. మోడ్రన్ ఇండియన్ మూవీ ఎరా లో టెక్నాలజీ ఎంత కీలకమో బోర్డర్ 2 క్లియర్ గా చెబుతోంది.
