Begin typing your search above and press return to search.

డ్యూడ్ అంటున్న ప్రదీప్ రంగనాథన్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్!

ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   28 Aug 2025 9:35 PM IST
డ్యూడ్ అంటున్న ప్రదీప్ రంగనాథన్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్!
X

ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పోలికలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఇప్పుడు ఆయన లాగే ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న మరో కొత్త చిత్రం డ్యూడ్. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ప్రేమలు' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

డ్యూడ్ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

కీర్తి స్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. స్వీయ సంగీత దర్శకత్వంలో సాయి అభ్యంకర్ పాడిన "భూమ్ భూమ్" వీడియో సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటకు సానపాటి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

డ్యూడ్ సినిమా విశేషాలు..

డ్యూడ్ సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ , మమితా బైజు ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో వీరితోపాటు ఆర్.శరత్ కుమార్, హృదు హరూన్ , రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే కీర్తి స్వరన్ తొలి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ వారికి రెండవ తమిళ నిర్మాణం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమా దీపావళి సందర్భంగా రానున్న బైసన్ మూవీతో పోటీ పడబోతోంది. అటు తమిల్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్..

అటు ఈ సినిమా తమిళ్ హక్కులను రోమియో పిక్చర్స్ సొంతం చేసుకోగా.. ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ వారు దక్కించుకున్నారు. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సుమారుగా రూ.25 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అటు శాటిలైట్ హక్కులను జీ తమిళ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ప్రదీప్ రంగనాథన్ సినిమాలు..

ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే.. నటుడిగా, దర్శకుడిగా, యూట్యూబర్ గా, నిర్మాతగా కూడా పేరు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్.. 2019లో వచ్చిన కోమాలి సినిమాతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 2022లో లవ్ టు డే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది.