కూతుళ్లకు బోనీ ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే?
రీమేక్ సినిమాలు హిందీలో ఇటీవల అంతగా వర్కవుట్ కావడం లేదు. అయినా అగ్ర నిర్మాత బోనీకపూర్ ప్రతియేటా కోట్లాది రూపాయలను రిస్కు చేస్తున్నానని అన్నారు
By: Sivaji Kontham | 8 Sept 2025 9:00 AM ISTరీమేక్ సినిమాలు హిందీలో ఇటీవల అంతగా వర్కవుట్ కావడం లేదు. అయినా అగ్ర నిర్మాత బోనీకపూర్ ప్రతియేటా కోట్లాది రూపాయలను రిస్కు చేస్తున్నానని అన్నారు. రీమేక్ హక్కుల కోసం సంవత్సరాలుగా తాను 35-40 కోట్ల వరకూ ఖర్చు చేసానని తెలిపారు. 2019లో విడుదలైన కోమలి రీమేక్ హక్కుల కోసం 3.5 కోట్లు చెల్లించానని, దీని హిందీ హక్కులను లవ్ రాంజాన్ కి అప్పజెప్పానని, ఇతర భాషలలో రీమేక్ హక్కులు తనవద్ద ఉంచుకున్నానని తెలిపారు.
తన కుమార్తెల కెరీర్ విషయమై తాను ఒత్తిడి చేయనని బోనీకపూర్ తెలిపారు. జాన్వీకపూర్, ఖుషి కపూర్ తమకు నచ్చిన స్క్రిప్టులను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారని అన్నారు. తన సొంత బ్యానర్ సినిమాలు చేయాలని ఒత్తిడి చేయనని అన్నారు. తదుపరి జాన్వీ, ఖుషితోను తాను సినిమాలు నిర్మించినా స్క్రిప్టు ఎంపికలో స్వేచ్ఛనిస్తానని తెలిపారు. తన సోదరుడు అనీల్ కపూర్ జుదాయి, బేవాఫా వంటి సినిమాలు చేయాలని తాను ఒప్పించినట్టు తెలిపారు. తన సోదరుడు అయినా కుమార్తెలు అయినా బయటి బ్యానర్లలో స్వేచ్ఛగా నచ్చిన స్క్రిప్టుల్లో నటించాలనేది తన కండిషన్ అని తెలిపారు బోనీ.
తదుపరి శ్రద్ధా కపూర్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న బోనీకపూర్ ప్రస్తుతం హిందీలో నాలుగు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. కన్నడం, భోజ్ పురిలోను సినిమాలు తీస్తానని, అన్ని భాషలకు విస్తరించాలనే తన ఆలోచనను కూడా చెప్పారు. తన ఫేవరెట్ నో ఎంట్రీ సీక్వెల్ `నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ`ని తెరకెక్కిస్తానని, ఏడాది చివరిలో ఈ సినిమా ప్రారంభమవుతుందని కూడా బోనీకపూర్ వెల్లడించారు.
