సిగ్నేచర్ లుక్‌కు వీడ్కోలు: కొత్త గెటప్ వెనుక ఆసక్తికర కథ!
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విభిన్నమైన ఆహార్యంతో...తనదైన హెయిర్ స్టైల్ ..సిగ్నేచర్ లుక్‌తో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
By: Srikanth Kontham | 24 Aug 2026 12:03 AM ISTబాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విభిన్నమైన ఆహార్యంతో...తనదైన హెయిర్ స్టైల్ ..సిగ్నేచర్ లుక్‌తో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దశాబ్దాలుగా ఆయన అదే లుక్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా బోనీ కపూర్ తన సిగ్నేచర్ లుక్‌కు గుడ్ బై చెప్పేసారు. తన కొత్త లుక్‌కు సంబంధించిన చివరి కొన్ని వారాల జ్ఞాపకాలను కుమార్తె జాన్వీ కపూర్‌తో కలిసి పంచుకున్నారు. తండ్రి మేకోవర్ గురించి చెబుతూ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బోనీ కపూర్ పాత హెయిర్ స్టైల్ .. సిగ్నేచర్ లుక్‌ను మార్చుకోవడానికి ముందు ఆ రూపంతో గడిపిన చివరి క్షణాలను ఎంతో సరదాగా రికార్డ్ చేసినట్లు తెలిపారు. కూతురితో కలిసి బోనీ కపూర్ తీసుకున్న నిర్ణయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీలో నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బోనీ కపూర్ వయసు పెరుగుతున్న కొద్దీ తనలోని వైవిధ్యాన్ని చాటేలా మేకోవర్ ట్రై చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు ఒకే రకమైన లుక్‌లో కనిపించిన బోనీ సడన్‌గా హెయిర్ స్టైల్‌ను మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానులు సైతం ఆయన కొత్త రూపాన్ని చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న సరదా ముచ్చట్లను జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తండ్రి పాత లుక్‌ను మిస్ అవుతున్నా? ఈ కొత్త మేకోవర్‌లో ఆయన చాలా యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల కాలం తర్వాత బోనీ కపూర్ రూపురేఖల్లో వచ్చిన మార్పు ఆయన అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. త్వరలోనే ఈ కొత్త లుక్‌తో పబ్లిక్‌గా ఎక్కడ కనిపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయతను, ఇలాంటి చిన్న చిన్న సరదా క్షణాలను పంచుకోవడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బోనీ కపూర్ వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ ..సౌత్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా దూసుకుపోతున్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా? కుటుంబంతో గడపడానికి ఇలాంటి సరదా జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వారు ఎప్పుడూ ముందుంటారు. అలాగే జాన్వీ తదుపరి తెలుగు సినిమా ఏ హీరోతో చేస్తుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే `దేవర`లో ఎన్టీఆర్ సరసన..`పెద్ది`లో రామ్ చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే.
