సీక్రెట్ రివీల్ చేసిన బోనీ కపూర్
నిర్మాతగా బోనీ కపూర్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన బ్యానర్‌లో 2022లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి.
By: Ramesh Palla | 27 Sept 2025 3:42 PM ISTబాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. ఇటీవల తన భార్య శ్రీదేవి ఫోటోలను షేర్ చేయడం ద్వారా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. శ్రీదేవి జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే బోనీ కపూర్ అప్పుడప్పుడు తాను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్ట్‌లు షేర్ చేస్తూ ఉంటాడు. ఈసారి తన ఒక సీక్రెట్‌ను బోనీ కపూర్ షేర్ చేయడం జరిగింది. సాధారణంగా సెలబ్రిటీలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. నిర్మాతలు ఇంకాస్త ఎక్కువగానే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ఈయన నిర్మాణంలో మైదాన్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనే విషయం తెల్సిందే.
నిర్మాతగా బోనీ కపూర్ వరుస సినిమాలు
నిర్మాతగా బోనీ కపూర్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన బ్యానర్‌లో 2022లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెంజుకు నీధి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతర సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా బోనీ కపూర్ నిర్మాతగా సినిమాలను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. 2023లో ఈయన నిర్మాణంలో రూపొందిన తునివు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో కమర్షియల్ బెనిఫిట్స్ను బోనీ కపూర్‌కి అందించలేదు అనేది అందరూ అనుకునే విషయం. ఇలాంటి సమయంలో నిర్మాతలు చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఒత్తిడిని బోనీ కపూర్ సైతం ఎదుర్కొంటూ ఉంటాడట. అలాంటప్పుడు బోనీ కపూర్ ఏం చేస్తాడు అనేందుకు తన పోస్ట్‌లో సమాధానం ఇచ్చాడు.
డాన్స్ చేయడం ద్వారా ఒత్తిడి..
తాను ఒత్తిడిలో ఉన్న సమయంలో డాన్స్ చేయడానికి ఇష్టపడుతాను, ఎవరు ఉన్నా లేకున్నా డాన్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒంటరిగా డాన్స్ చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని జయించేందుకు డాన్స్ చేయాలని చాలా మంది అంటూ ఉంటారు. ఒత్తిడిని జయించేందుకు బోనీ కపూర్ అదే పని చేస్తున్నాను అంటూ తాను డాన్స్ చేస్తున్న ఒక ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. బోనీ కపూర్ వంటి ప్రముఖ నిర్మాత ఇలా డాన్స్ చేస్తాడని ఏ ఒక్కరూ ఊహించరు. కానీ బోనీ కపూర్ స్వయంగా తాను డాన్స్ చేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తున్నాను అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డాన్స్ లో ఉన్న గొప్పతనం ఇది అంటూ చాలా మంది కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ బోనీ కపూర్ పోస్ట్‌ను లైక్ చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో బోనీ కపూర్
బోనీ కపూర్ నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆయన నటన కెరీర్ కంటిన్యూ చేయలేదు. పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన బోనీ కపూర్ ముంబైలోని అవర్ లేడీ ఆఫ్ పెర్పెచ్యువల్ సక్కర్ హైస్కూల్‌లో చదివాడు, ఆ తర్వాత సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో చదివాడు. ముంబైలో ఉన్న పరిచయాల కారణంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నిర్మాతగా 1980లోనే హమ్ పాంచ్ సినిమాను నిర్మించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలుగులో 1992లోనే బోనీ కపూర్ ఒక సినిమాను నిర్మించాడు. ఆ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అంతం అనే తెలుగు సినిమాను సైతం బోనీ కపూర్ నిర్మించడం ద్వారా బోనీ కపూర్ తెలుగు వారికి దగ్గర అయ్యాడు. శ్రీదేవిని వివాహం చేసుకోవడంతో బోనీ కపూర్ సుపరిచితుడుగా మారాడు. జాన్వీ కపూర్ తండ్రిగా బోనీ కపూర్ ఇప్పుడు మరింతగా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు.
