Begin typing your search above and press return to search.

ఫ్యాష‌న్ కోసం బాలీవుడ్..పారితోషికం కోసం టాలీవుడ్డా?

అంత‌కంటే త‌క్కువ‌గా హిందీ సినిమాకు ఇచ్చినా ప‌ని చేస్తాను త‌ప్ప తెలుగు సినిమాకు మాత్రం త‌గ్గేదేలు అన్న ధోర‌ణి అక్క‌డ హైలైట్ అయింది.

By:  Srikanth Kontham   |   25 Nov 2025 12:31 PM IST
ఫ్యాష‌న్ కోసం బాలీవుడ్..పారితోషికం కోసం టాలీవుడ్డా?
X

తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న కాక‌ముందే? నెంబ‌ర్ వ‌న్ ప‌రిశ్ర‌మ అంటే అంతా బాలీవుడ్ వైపే వేలెత్తి చూపించేవారు. భారీ పారితోషికం కూడా అక్క‌డ న‌టీన‌టులే తీసుకుంటారు? అన్న‌ది తెలిసిన వాస్త‌వం. కానీ తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైన త‌ర్వాత బాలీవుడ్డే టాలీవుడ్ వైపు చూస్తోంది? అన్న‌ది అంతే వాస్త‌వం. అక్క‌డ స్టార్ హీరోలంతా తెలుగు డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌డానికి క్యూలో ఉన్నారు. మ‌న డైరెక్ట‌ర్లు అక్క‌డికి వ‌చ్చినా స‌రే? త‌మ‌ని హైద‌రాబాద్ కి పిలిచినా ఒకే చెప్ప‌డానికి సిద్దంగా ఉన్నారు. హీరోల ప‌రంగా ఓపెన్ హార్ట్ తోనే ఎదురు చూస్తున్నారు.

నిర్మొహ మాటంగా రిజెక్ట్ చేసింది:

కానీ అదే బాలీవుడ్ హీరోయిన్ల‌కు టాలీవుడ్ అన్న‌ది పారితోషికంగా ప‌రంగానే హైలైట్ అవుతుంది. ప్యాష‌న్ కోసం బాలీవుడ్..పారితోషికం కోసం టాలీవుడ్ అంటూ కొంత మంది భామ‌లు తెలుగు సినిమాలు క‌మిట్ అవుతోన్న తీరును బ‌ట్టి తెర‌పైకి వ‌స్తోంది. `క‌ల్కి 2 `లో దీపికా ప‌దుకొణే అవ‌కాశం ఎంత సుల‌భంగా వ‌దులుకుందో తెలిసిందే. `క‌ల్కి` మొద‌టి భాగంలో న‌టించిన అమ్మ‌డు రెండ‌వ భాగానికి అధిక‌ పారితోషికం డిమాండ్ చేసింది అని ఒక టాక్ ఉంది. తాను అడిగినంత ఇవ్వ‌క‌పోతే మాత్రం న‌టించ‌న‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేసింది అని అంటారు.

చ‌ర‌ణ్‌, తారక ల‌కు ఆ న‌టి నో:

అంత‌కంటే త‌క్కువ‌గా హిందీ సినిమాకు ఇచ్చినా ప‌ని చేస్తాను త‌ప్ప తెలుగు సినిమాకు మాత్రం త‌గ్గేదేలే అన్న ధోర‌ణి అక్క‌డ హైలైట్ అయింది. దీంతో `క‌ల్కి 2` మేక‌ర్స్ కూడా నీ సేవ‌లిక చాలంటూ బ్యాలెన్స్ చెల్లించి సాగ‌నంపించారు. మ‌రో న‌టి అలియాభ‌ట్ కూడా అదే తీరుతో క‌నిపిస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత అమ్మ‌డికి ఎన్టీఆర్ `దేవ‌ర‌`లో ఛాన్స్ ఇస్తాన‌న్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. కానీ నో చెప్పింది. అయినా మ‌రోసారి ఒప్పించే ప్ర‌య‌త్నం చేసారు. అప్పుడు కూడా నో చెప్పింది. తార‌క్ త‌న‌కు మంచి స్నేహితుడు అయినా స‌రే నో ఛాన్స్ అనేసింది.

అక్క‌డ టైర్ స్టార్లు అయినా ఒకే:

ఆ త‌ర్వాత బుచ్చిబాబు..రామ్ చ‌ర‌ణ్ కూడా `పెద్ది` కోసం ప్ర‌యత్నించారు. వాళ్ల‌కు కూడా అమ్మ‌డు నో చెప్పింది. ఇలా ఇన్ని నోలు వెనుక కార‌ణం ఏంటి? అంత‌కంటే చిన్న సినిమాలైనా బాలీవుడ్ కి ఎస్ చెప్ప‌డం వెనుక అస‌లు కార‌ణం ఏంటి? అంటే పారితోషికం అన్న మాట ఆ త‌ర్వాత తెరపైకి వ‌చ్చింది. తాను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి మేక‌ర్స్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో నో చెప్పిందన్నారు. కియారా అద్వాణీ కూడా అగ్ర హీరోల‌తో త‌ప్ప టైర్ 2 తెలుగులో హీరోల‌కు నో చెబుతుంది. కానీ బాలీవుడ్ లో మాత్రం టైర్ 2 హీరోల‌తోనూ క‌లిసి ప‌ని చేస్తోంది.

పీసీ కూడా త‌క్కువేం కాదు:

`సాహో` త‌ర్వాత శ్ర‌ద్దా క‌పూర్ ని ఎన్నో తెలుగు ఆఫ‌ర్లు వ‌రించాయి. కానీ అమ్మ‌డు ఏ సినిమాకు ఒకే చెప్ప‌లేదు. త‌న డిమాండ్ ను తెలుగు నిర్మాత‌లు త‌ట్టుకోలేర‌నే `సాహో` త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాల‌కు నో చెప్పిందన్నారు. క‌త్రినా కైఫ్ కూడా తెలుగు సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమా వైపు చూడ లేదు. గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఎస్ ఎస్ ఎంబీ 29 కంటే ముందు ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ వాటి వేటికి అంగీక‌రించ‌లేదు. `వార‌ణాసి` గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ కావ‌డంతో..రెట్టింపు పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతోనే ఒకే చెప్పిందన్న‌ది కాద‌న‌లేని నిజం.