ఏం తింటున్నార్రా బాబూ.. టాప్ హీరోయిన్‌ల ఫిట్నెస్ సీక్రెట్స్!
గ్లామర్ రంగంలో రూపాన్ని మెయింటెయిన్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తల్లి అయ్యాక కూడా తిరిగి హీరోయిన్ గా రాణించాలంటే.. దానికోసం కఠోరమైన శ్రమ, ప్రణాళిక తప్పనిసరి.
By: Sivaji Kontham | 23 Jun 2026 5:00 AM ISTబాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సుపరిచితమైన టాప్ -10 అందగత్తెలు తమ సిల్కీ లుక్ -సన్నజాజి తీగ లాంటి శరీరాకృతిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారో తెలుసా? వెండితెరపై తళతళా మెరిసిపోయే ఈ భామల ఫిట్‌నెస్ రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా? ఉంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
గ్లామర్ రంగంలో రూపాన్ని మెయింటెయిన్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తల్లి అయ్యాక కూడా తిరిగి హీరోయిన్ గా రాణించాలంటే.. దానికోసం కఠోరమైన శ్రమ, ప్రణాళిక తప్పనిసరి. భారత చలనచిత్ర పరిశ్రమలో రాణిస్తున్న టాప్ 10 హీరోయిన్ ల ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ ను పరిశీలిస్తే.. బాలీవుడ్ - సౌత్ చిత్రసీమలోని టాప్ హీరోయిన్లు కేవలం సాధారణ వర్కౌట్లతో సరిపెట్టడం లేదు. ఈ అందాల భామలు తమ రోజువారీ జీవనశైలిలో జిమ్ - పైలేట్స్ ట్రైనింగ్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని సర్వేలో తేలింది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపిక పదుకొనే, ఆలియా భట్, కత్రినా కైఫ్ తమ ఫిట్‌నెస్ క్లాసులలో పైలేట్స్‌ను ఒక ప్రధాన భాగంగా చేసుకున్నారు. పైలేట్స్ వ్యాయామాలు శరీరం ఫ్లెక్సిబిలిటీని (సమతుల్యత) పెంచడమే కాకుండా, శారీరకంగా బలాన్ని పటిష్టం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ముఖ్యంగా ఆలియా భట్ గర్భధారణ తర్వాత కూడా చాలా త్వరగా తన పాత రూపానికి రావడానికి ఈ పైలేట్స్ రొటీన్ ఎంతో సహాయపడింది. ఇక కత్రినా, దీపికా కూడా మామ్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ తమ పర్‌ఫెక్ట్ బాడీ షేప్ కోసం వెయిట్ ట్రైనింగ్ - పైలేట్స్‌ను కలిపి బ్యాలెన్స్ చేస్తుంటారు.
ఈ ఫిట్‌నెస్ రేసులో సీనియర్ భామలు కరీనా కపూర్ ఖాన్ - మలైకా అరోరా ఎవరికీ తీసిపోరని నిరూపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా తయారవ్వడం వీరికే చెల్లింది. మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా క్లిష్టమైన పైలేట్స్ , యోగాసనాలను షేర్ చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంటుంది. అలాగే ఇద్దరు పిల్లల తల్లైన కరీనా కపూర్ కూడా జిమ్‌లో హెవీ వెయిట్ ట్రైనింగ్ .. కఠినమైన కార్డియో వర్కౌట్లను అలవోకగా చేస్తూ తన గ్లామర్‌ను కాపాడుకుంటోంది.
సౌత్ స్టార్ సమంత రూత్ ప్రభు ఫిట్‌నెస్ సెషన్స్‌లో పైలేట్స్ చాలా కీలకమైనది. మయోసైటిస్ సహా కొన్నిరకాల శారీరక సవాళ్లను ఎదుర్కొన్నా సామ్ జిమ్‌లో కఠినంగా శ్రమిస్తూ, గ్రేట్ కంబ్యాక్ ఎలా ఉంటుందో చూపించారు. సమంత వెయిట్ లిఫ్టింగ్, క్యాలిస్టెనిక్స్, పైలేట్స్ సెషన్ల వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తనలాగే నేటి తరం యంగ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్, ఆలయ ఎఫ్ వంటి వారు కూడా ఈ తరహా కఠినమైన శిక్షణనే నమ్ముకున్నారు. జాన్వీ కపూర్ తన కర్వీ ఫిగర్‌ను నిలబెట్టుకోవడానికి జిమ్ వర్కౌట్లతో పాటు రెగ్యులర్‌గా పైలేట్స్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది.
ఈ పదిమంది స్టార్ హీరోయిన్ల ఫిట్‌నెస్ సీక్రెట్ కేవలం డైటింగ్ మాత్రమే కాదు...క్రమం తప్పని శారీరక శ్రమ. వెయిట్ ట్రైనింగ్ ద్వారా కండరాల బలాన్ని పెంచుకుంటూనే... పైలేట్స్ ద్వారా తమ శరీరాన్ని సన్నజాజి తీగలా మలుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త వర్కౌట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ.. తమ బాడీని టోన్డ్ గా ఉంచుకోవడమే ఈ గ్లామర్ క్వీన్స్ అసలైన మంత్రం. అందుకే వీరంతా వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ మిలియన్ల మందికి ఫిట్‌నెస్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు.
