నిజమైన వ్యక్తిగా భావించాలి..
నార్త్ , సౌత్ సినిమాలలో నటించడం గురించి మాట్లాడుతూ.. ఈ రెండు ప్రపంచాల మధ్య భాషా వ్యత్యాసం తప్ప చిత్రీకరణ కొంచెం భిన్నంగా ఉంటుంది.
By: Madhu Reddy | 26 Dec 2025 8:08 PM ISTహిందీ సీరియల్స్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి.. మరాఠీ, హిందీ చిత్రాలలో నటిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నేరుగా చేసిన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. చేసింది మొదటి సినిమానే అయినా ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి ఈ సినిమాలో ఈమె నటించిన సీత పాత్రతోనే మంచి ప్రాచుర్యం అందుకుంది.
ఈ సినిమా విజయం సాధించడంతో మృణాల్ కు తెలుగులో బాగానే అవకాశాలు తలుపు తట్టాయి. అలా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో జోత్స్న అనే పాత్రలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ అవకాశాలు తలుపుతట్టలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.
వాస్తవానికి ఇందులో మొదట శృతిహాసన్ హీరోయిన్గా ఎంపికైంది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల శృతిహాసన్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని మృణాల్ భర్తీ చేసింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పైనే అమ్మడు అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా గనుక హిట్ అయితే మాత్రం మళ్లీ ఈమెకు టాలీవుడ్ లో గట్టి కం బ్యాక్ దొరికినట్లే అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా అజయ్ దేవగన్ తో కలిసి సన్నాఫ్ సర్దార్ 2 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
నార్త్ , సౌత్ సినిమాలలో నటించడం గురించి మాట్లాడుతూ.. ఈ రెండు ప్రపంచాల మధ్య భాషా వ్యత్యాసం తప్ప చిత్రీకరణ కొంచెం భిన్నంగా ఉంటుంది. రెండు పరిశ్రమల్లో షూటింగ్ చేయడం.. ఎక్కువమంది ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించడమే నా మొదటి లక్ష్యం. ఇకపోతే దక్షిణాది చిత్రాలలో నటించడం అనేది నా ప్రణాళికలో లేదు. కనీసం ఎప్పుడూ కూడా అనుకోని విషయం.. కానీ ఈ అవకాశాన్ని నేను ఒక అదృష్టంలా భావిస్తున్నాను" అంటూ తెలిపింది.
అలాగే సోషల్ మీడియాలో నటీనటులందరూ ఫోటోలు, పోస్ట్ లు పెట్టడానికి ప్రత్యేక టీం ను పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ కూడా నా ఇంస్టాగ్రామ్ ఖాతాను పోస్టులతో ప్రజాధరణ పొందడానికి.. లైకులు, ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఒక సాధనంగా పరిగణించలేదు. ముఖ్యంగా ఇతరుల కోసం నేను పోస్ట్ చేయను. ప్రేక్షకులు మనల్ని నిజమైన వ్యక్తిలా భావించినప్పుడే మనకు ఆ క్రేజ్ లభిస్తుంది.
అందుకే నేను నా అభిమానులు నన్ను నిజమైన వ్యక్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇతరుల ఏమనుకుంటారో అనే పట్టించుకోకుండా మన పనిని మనం కొనసాగించాలనే సూత్రాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను అంటూ మృణాల్ తెలిపింది. మొత్తానికైతే మన ఉనికిని చాటుకోవడానికి పి ఆర్ టీం అవసరం లేదని చెప్పిన ఈమె.. . ఇతరుల అవసరం లేకుండా తానే స్వయంగా తన పోస్ట్లు చేసుకుంటానని చెప్పి సెలబ్రిటీలను కూడా ఆలోచింపజేసింది ఈ ముద్దుగుమ్మ.
