Begin typing your search above and press return to search.

టాప్ స్టార్స్.. టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్..

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.

By:  Madhu Reddy   |   9 Nov 2025 3:00 PM IST
టాప్ స్టార్స్.. టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్..
X

ఇండస్ట్రీకి ఎక్కువ శాతం మంది ఎంట్రీ ఇచ్చేదే సరైన గుర్తింపు కోసం. డబ్బులు వచ్చే పనులు ఎన్ని ఉన్నా కూడా ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపుతున్నారు అంటే ఖచ్చితంగా ఫేమ్ గురించి ఆలోచిస్తున్నారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే యాక్టింగ్ మీద విపరీతమైన ప్యాషన్ తో కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్లలో కొంతమంది సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు.

కేవలం ఒక లాంగ్వేజ్ లోనే సినిమాలు చేయడం కాకుండా మిగతా లాంగ్వేజ్ లో కూడా రాణించిన హీరోయిన్లు ఉన్నారు.అలా తెలుగులో ' ఈ రోజుల్లో' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది. ఆ తరువాత తమిళ్ సినిమాల్లోనే మంచి గుర్తింపు సాధించుకుంది. వెట్రి మారన్, మారి సెల్వరాజ్ వంటి దర్శకుల తో కూడా పనిచేసింది తెలుగు హీరోయిన్ ఆనంది. అలానే చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవుతూ తెలుగులో తమను తాము ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగు సినిమాలు కూడా చేస్తారు.కానీ అన్నిసార్లు అది వర్కౌట్ కాదు.

బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా తెలుగులో అప్పుడు ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా నిలబడలేకపోయారు కంగనా. ఇక ప్రస్తుతం మాత్రం ఏ లాంగ్వేజ్ లో సినిమా చేసినా అన్ని భాషలకి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఎన్నో అద్భుతమైన సినిమాలతో విపరీతమైన గుర్తింపు సాధించుకున్న బిపాసా బసు. జయంత్ సి దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు సరసన కనిపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ సరసన కత్రినా కైఫ్ నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ కూడా సాధించింది. కానీ ఆ తర్వాత తెలుగులో అల్లరి పిడుగు సినిమా చేసింది కానీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆమె మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు కత్రినా. బాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించుకుంది స్నేహ ఉల్లాల్. తెలుగులో కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయింది ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు.

బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలు చేస్తుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమా మినహాయిస్తే తెలుగులో ఈమెకు కూడా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె దబాంగ్ సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది. ఇదే సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సోనాక్షి జటాధర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కంప్లీట్ డిజాస్టర్ గా మారిపోయింది. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా గురించి ఎక్కడా కూడా పాజిటివ్ టాక్ వినిపించడం లేదు. ఇక మళ్లీ తెలుగులో మరోసారి తను ప్రయత్నిస్తుందా, లేకపోతే వదిలేస్తుందా అనేది చూడాలి.