Begin typing your search above and press return to search.

'ధురందర్ 3' ట్రెండ్ తో రంగంలోకి యువ నటులు !

ముంబై లో విద్యార్థుల నిరసన కార్యక్రమం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక అంశాలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సెలబ్రిటీలు సంఘీభావం తెలపడం విశేషం.

By:  Srikanth Kontham   |   22 July 2026 1:53 PM IST
ధురందర్ 3 ట్రెండ్ తో రంగంలోకి యువ నటులు !
X

ముంబై లో విద్యార్థుల నిరసన కార్యక్రమం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక అంశాలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సెలబ్రిటీలు సంఘీభావం తెలపడం విశేషం. ముఖ్యంగా ఇటీవల పాపులర్ అయిన 'ధురందర్ 3' ట్రెండ్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూ విద్యార్థులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో యువ నటులు గుర్‌ఫతేహ్ పిర్జాదా, ప్రతిభా రంతా, సింగర్ ఆకాశా సింగ్ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఈ నిరసనలో పాల్గొన్న గుర్‌ఫతేహ్ పిర్జాదా, ప్రతిభా రంతా లు మాట్లాడుతూ యువత గొంతును ఎప్పుడూ నొక్కలేరని, సరైన అంశాలపై వారు నిలబడటం అభినందనీయమని పేర్కొన్నారు.

సినిమాల్లో డైలాగ్‌లు చెప్పడమే కాకుండా నిజ జీవితంలోనూ సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత తమపై ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చేస్తున్న శాంతియుత ఆందోళనకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా వ‌స్తోన్న‌ మద్దతు సోషల్ మీడియాలో మరింత వేగంగా వైరల్ అవుతోంది. ఇదే సందర్భంలో ప్రముఖ గాయని ఆకాశా సింగ్ తన గళంతో నిరసనకారుల్లో జోష్ నింపారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా రోడ్డెక్కి మద్దతు తెలిపిన యువ తారల తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా యువతలో భారీ క్రేజ్ ఉన్న నటీనటులు అక్కడికి చేరుకోవడం వల్ల నిరసనకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది.

ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా నిలిచిన `ధురందర్ 3` అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో చూపించే తిరుగుబాటు స్ఫూర్తిని నిజ జీవితంలో యువత ఎలా అన్వయించుకుంటుందో ? ఈ ఘటన ద్వారా అర్ద‌మ‌వుతుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా సెలబ్రిటీలు కూడా ఇలాంటి వేదికలపై గళం విప్పడం పట్ల ట్రేడ్ వర్గాలు .. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

సినిమాల విషయానికి వస్తే గుర్‌ఫతేహ్ పిర్జాదా .. ప్రతిభా రంతా లు వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటీనటులు, సామాజిక బాధ్యత విషయంలోనూ ముందుండటం విశేషం. వీరితో పాటు ఆకాశా సింగ్ తన మ్యూజికల్ కంటెంట్‌తో యూత్‌ను ఆకట్టుకుంటూనే ఇలాంటి ప్రజా సమస్యల పట్ల స్పందించి ఉనికిని చాటుకుంటున్నారు.

ఈ నిరసన కార్యక్రమం స్థానిక సమస్యగానే కాకుండా పాపులర్ కల్చర్‌ను ముడిపెట్టి యువత చేసిన వినూత్న నిరసనగా నిలిచింది. ప్రముఖుల రాకతో మరింత బలపడిన ఈ ఆందోళన భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వాంగ్ చుక్ కు మ‌ద్ద‌తుగా సౌత్ నుంచి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాస్ రాజ్ ఎలాంటి స్టాండ్ తో నిల‌బ‌డ్డారో తెలిసిందే. విద్యార్దుల‌తో పాటు ఆయ‌న కూడా క‌లిసి పోరాటం చేయ‌డం విశేషం. ఈ పోరాటంతో విల‌న్ పాత్ర‌లు పోషించే ప్ర‌కాష్ రాజ్ రియ‌ల్ లైఫ్ లో యువ‌త ప‌ట్ల హీరోగా మారిపోయారు.