Begin typing your search above and press return to search.

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

విడాకుల తర్వాత కూడా మాజీ భాగస్వాములతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ బాలీవుడ్‌ తారలు ఆదర్శంగా నిలుస్తున్నారు. హృతిక్‌ రోషన్‌–సబా ఆజాద్‌, సుజానే ఖాన్‌–అర్స్‌లాన్‌ గోని, సైఫ్‌–కరీనా, అమీర్‌ ఖాన్‌–గౌరీ స్ప్రాట్‌ జంటలు తమ బంధాలతో వార్తల్లో నిలుస్తున్నారు. పిల్లల కోసం ఒకే కుటుంబంలా మెలగడం, గత బంధాలను గౌరవిస్తూ కొత్త జీవితాన్ని కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

By:  Sivaji Kontham   |   17 Nov 2026 12:42 AM IST
విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌
X

ఈరోజుల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అయినా.. గత బంధాల తాలూకు చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి.. పరిణతితో ముందుకు సాగుతున్న కొందరు బాలీవుడ్ తారలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ - సబా ఆజాద్, హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్ - అర్స్‌లాన్ గోని, సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్, అలాగే అమీర్ ఖాన్ - గౌరీ స్ప్రాట్ వంటి జంటలు తమ అన్యోన్యతతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతాన్ని గౌరవిస్తూనే..ప్రస్తుత జీవితంలో ఒక‌రికొక‌రు తోడుగా నిలుస్తున్న ఈ జంటలు ఆధునిక రిలేషన్‌షిప్‌లకు కొత్త అర్థం చెబుతున్నాయి.

హృతిక్ రోషన్, సబా ఆజాద్‌ల ప్రేమాయణం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరోవైపు హృతిక్‌తో విడాకుల తర్వాత సుజానే ఖాన్.. నటుడు అర్స్‌లాన్ గోనితో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. విశేషమేమిటంటే, హృతిక్-సబా, సుజానే-అర్స్‌లాన్ తరచూ కలిసి పార్టీలు చేసుకోవడం.. తమ పిల్లల కోసం ఒకే కుటుంబంలా మెలగడం అభిమానుల మనసు గెలుచుకుంటోంది. ఇక సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల విషయానికి వస్తే.. సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్‌తో విడిపోయిన తర్వాత కరీనాను వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు సారా, ఇబ్రహీంలతో కరీనా ఎంతో ఆప్యాయంగా ఉంటూ.. సైఫ్‌తో కలిసి బాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా వెలుగొందుతున్నారు.

ఇక మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సైతం తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. కిరణ్ రావుతో విడాకుల తర్వాత.. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్‌షిప్‌ను బహిరంగంగా రివీల్ చేసి పెళ్లితో ఒక‌టైన‌ అమీర్, ఆమెతో కలిసి వేడుకల్లో సందడి చేస్తున్నారు. మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే.. గౌరీతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విడిపోయినా ద్వేషాలు పెంచుకోకుండా.. ఎవరి జీవితాల్లో వారు ఆనందంగా ఉంటూనే గౌరవప్రదమైన బంధాలను నిర్మించుకోవడంలో ఈ జంటలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

కెరీర్ పరంగా చూస్తే ఈ స్టార్స్ అంతా ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ తన ప్రతిష్టాత్మక చిత్రం `క్రిష్ 4` పనుల్లో నిమగ్నమవ్వగా.. సబా ఆజాద్ పలు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో పాటు తన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలతో బిజీగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ హ‌మ్ హిందూస్తానీ చిత్రంలో నటిస్తుండగా... కరీనా కపూర్ ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఇక అమీర్ ఖాన్ నిర్మాతగా, నటుడిగా త‌దుప‌రి ప్ర‌ణాళిక‌లతో బిజీగా ఉన్నారు.