సరికొత్త గెటప్ లో తారలు.. ఇలా భయపెట్టేస్తున్నారేంటి?
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ లార్డ్ ఆంటోనీ బ్రిడ్జర్ టన్ అనే గెటప్ లో కనిపించారు.ఇలా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు విభిన్నమైన గెటప్ లు ధరించి ఈ హాలోవిన్ వేడుకల్లో సందడి చేశారు.
By: Madhu Reddy | 1 Nov 2025 5:57 PM ISTబాలీవుడ్ సెలబ్రిటీలు పండగలు,ఈవెంట్లు వంటి వాటిల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. తాజాగా జామ్ నగర్ లోని నీతా అంబానీ హోస్ట్ గా చేసిన హలోవిన్ పార్టీలో బాలీవుడ్ తారలందరూ విభిన్నమైన గెటప్ లలో మెరిసారు. ఇందులో బాలీవుడ్ అల్టిమేట్ ఇన్సైడర్ ఓర్రి ఐకానిక్ హాలోవీన్ బాష్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్పులను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దీపిక పదుకొనే,జాన్వీ కపూర్,అలియా భట్ లాంటి ఎంతోమంది మెరిసారు. ఈ పార్టీలో దీపిక పదుకొనే తన లేడీ సింగం రోల్ లో కనిపించింది.
అలా పోలీస్ డ్రెస్ లో దీపిక పదుకొనే సందడి చేసింది. అలాగే అలియాభట్ లారా క్రాఫ్ట్ పాత్రలో ఈ పార్టీలో మెరిసింది. అంతేకాకుండా నీతా అంబానీ ఐకానిక్ ఆడ్రి హెప్బర్న్ గా పాతకాలపు అమ్మాయిలా కనిపించింది. అలాగే రణవీర్ సింగ్ స్పైడర్ మాన్ గెటప్ లో కనిపించగా.. అర్జున్ కపూర్ టెర్మినేటర్ గా కనిపించాడు. జాన్వీ కపూర్ ఏంజెలా డీ మార్కో గెటప్ లో సందడి చేయగా.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హ్యారీ పోటర్ గెటప్ లో కనిపించారు. ఇక రీసెంట్ గా వెబ్ సిరీస్ తో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రోక్ బ్యాక్ మౌంటెన్ గెటప్ లో సందడి చేశారు..
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ లార్డ్ ఆంటోనీ బ్రిడ్జర్ టన్ అనే గెటప్ లో కనిపించారు.ఇలా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు విభిన్నమైన గెటప్ లు ధరించి ఈ హాలోవిన్ వేడుకల్లో సందడి చేశారు. ఈ హాలోవీన్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకుంటారు. అలా బాలీవుడ్ లోని సెలబ్రిటీలు కూడా గుజరాత్ లోని జామ్ నగర్లో ఈ హాలోవీన్ వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు..
ఈ హాలోవీన్ వేడుకలను జరుపుకోవడానికి కారణం.. సెల్టిక్ సంస్కృతిలో ఈ రోజు. నాడు చనిపోయిన వారి ఆత్మలు భూమి పైకి వస్తాయని దృఢంగా నమ్ముతారు. అయితే ఇలా భూమి పైకి వచ్చిన ఆత్మలలో చెడు ఆత్మలను తరిమికొట్టడానికి లేదా వశపరచుకోవడానికి ఈ విధంగా చాలామంది ప్రజలు వింత వింత డ్రెస్సులు వేసుకొని దెయ్యాలని భయపెడతారని తెలుస్తోంది.
