హీరోయిన్‌తో దొరికిపోయి.. చివరికి లేడీ జర్నలిస్ట్ కెమెరా లాక్కున్నాడు!
బాలీవుడ్‌లో ఒక లెజెండరీ హీరో నటవారసుడు, ప్రస్తుత అగ్ర హీరో ప్రేమ వ్యవహారాలు-ఎఫైర్లు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి.
By: Sivaji Kontham | 14 Sept 2026 11:19 AM ISTబాలీవుడ్‌లో ఒక లెజెండరీ హీరో నటవారసుడు, ప్రస్తుత అగ్ర హీరో ప్రేమ వ్యవహారాలు-ఎఫైర్లు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఒకే సమయంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఈ హీరో గతంలో ప్రియురాలిని కలుస్తున్న సమయంలో మీడియా కెమెరాలకు చిక్కి పెద్ద కలకలమే సృష్టించారు. ఆ నాటి లవ్ స్టోరీలు .. ఆ పాత జ్ఞాపకాలు, సంఘటనలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పాత ఘటన ప్రకారం.. ఒక ప్రముఖ హిందీ హీరోయిన్‌ను రహస్యంగా కలవడానికి వెళ్లిన ఆ బాలీవుడ్ హీరోను కవర్ చేయడానికి జర్నలిస్టులు ప్రయత్నించారు. అప్పట్లో వారిద్దరి మధ్య సాగుతున్న ప్రేమాయణం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండాలని వారు భావించారు. అయితే పక్కా సమాచారంతో ఆ హీరోయిన్ మేనేజర్ ఇల్లు లేదా నివాసం వద్ద కాపలా కాసిన మీడియా బృందం... వారి రహస్య భేటీని కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది.
అక్కడ కారు దిగుతున్న దృశ్యాలను రికార్డ్ చేస్తుండగా గమనించిన ఆ హీరో మొదట కారు అద్దం దించి చూసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ కెమెరా ఆన్ చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ హీరో కారును వెనక్కి పోనిచ్చి జర్నలిస్టులను వెంబడించారు. ప్రెస్ కార్ వద్దకు వచ్చి స్వయంగా కారు డోర్ ఓపెన్ చేసి.. వారి కెమెరా బ్యాగ్ .. బూమ్ మైక్‌ను బలవంతంగా లాక్కుని ఎత్తుకెళ్లినట్లు ఆనాటి ఇంటర్వ్యూలో ఒక మాజీ జర్నలిస్ట్ బయటపెట్టారు.
ఇకపై తనను ఫాలో కానని.. ఎలాంటి ఫొటోలు తీయమని ప్రామిస్ చేస్తేనే మీ సామాగ్రిని వెనక్కి ఇస్తానని ఆ హీరో షరతు పెట్టారట. అయితే అది తమ వృత్తిపరమైన బాధ్యత అని... అలా ప్రామిస్ చేసేది లేదని లేడీ జర్నలిస్ట్ స్పష్టం చేయడంతో ఆశ్చర్యపోయారు. ఆ జర్నలిస్ట్ వెనక్కి తగ్గేది లేదని గ్రహించిన ఆ హీరో.. చేసేది లేక చివరకు ఆమె కెమెరా బ్యాగ్‌ను, పరికరాలను తిరిగి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అప్పట్లో అత్యంత గోప్యంగా ఉంచాలనుకున్న ఈ ఎఫైర్ తంతు .. మీడియాపై ఆ హీరో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు, మీడియా కవరేజ్ మధ్య జరిగే ఈ రకమైన హై-వోల్టేజ్ డ్రామాలు బాలీవుడ్ వర్గాల్లో ఎప్పుడూ ఆసక్తికరంగానే మారుతుంటాయి. ఈ ఆసక్తికరమైన విషయాన్ని నెటిజనులు పదే పదే రిపీటెడ్ గా సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తూనే ఉన్నారు.
