Begin typing your search above and press return to search.

నార్త్ మార్కెట్ పై దేవ‌ర‌2 క‌న్ను.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే!

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన సినిమా దేవ‌ర బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లే అందుకుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Oct 2025 12:52 PM IST
నార్త్ మార్కెట్ పై దేవ‌ర‌2 క‌న్ను.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడే!
X

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన సినిమా దేవ‌ర బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లే అందుకుంది. అర‌వింద స‌మేత త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి చాలా కాలం త‌ర్వాత వ‌చ్చిన సోలో మూవీ కావ‌డంతో దేవ‌ర‌పై ముందు నుంచి మంచి అంచ‌నాలున్నాయి. పైగా ఎన్టీఆర్- కొర‌టాల శివ కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ మంచి హిట్టైన నేప‌థ్యంలో దేవ‌ర బ‌జ్ పై ఆ ఇంపాక్ట్ కూడా ఉంది.

క‌థ మొత్తం దేవ‌ర‌2లోనే..

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన దేవ‌ర మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్ల‌నైతే రాబ‌ట్టుకుంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా దేవ‌ర2 రానుంద‌ని మేక‌ర్స్ ముందే చెప్ప‌గా, దేవ‌ర సినిమాలో కంటే దేవ‌ర‌2 లోనే ఎక్కువ క‌థ ఉండ‌నుంద‌ని, సీక్వెల్ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఇంకా చెప్పాలంటే దేవ‌ర‌2 లోనే క‌థ మొత్తం దాగి ఉంద‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కొర‌టాల స్పెష‌ల్ కేర్

అయితే ఇప్పుడు దేవ‌ర‌2 గురించి ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ, దేవ‌ర‌2 క‌థ‌లో చాలా మార్పులు చేశార‌ని అంటున్నారు. వార్2 సినిమా త‌ర్వాత తార‌క్ కు బాలీవుడ్ లో క్రేజ్ మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో నార్త్ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకుని వారిని మ‌రింత ఆక‌ట్టుకోవ‌డానికి కొర‌టాల కొన్ని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

దేవ‌ర‌2లో మ‌రో బాలీవుడ్ హీరో

అందుకే ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ హీరోను తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. ఆల్రెడీ దేవ‌ర‌లో విల‌న్ గా న‌టించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దేవ‌ర‌2లో క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌తో పాటూ మ‌రో బాలీవుడ్ హీరోను కూడా దేవ‌ర‌2 లో భాగం చేయాల‌ని కొరటాల భావిస్తున్నార‌ట‌. అలానే దేవ‌ర2లో జాన్వీతో పాటూ మ‌రో హీరోయిన్ కూడా క‌నిపించనుంద‌ని అంటున్నారు. చూస్తుంటే కొర‌టాల ఈసారి దేవ‌ర‌2ను గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది.