బాలీవుడ్ మారదా.. ఇంకా అవే మూవీస్
కానీ, బాలీవుడ్ మారలేదనడానికి లేటెస్ట్ అప్‌డేటే పెద్ద ప్రూఫ్. 'ఆల్ఫా' సినిమాకు బజ్ తేవడానికి, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ పవర్ సరిపోదన్నట్లు, మళ్లీ పాత హీరోనే రంగంలోకి దించుతున్నారు.
By: M Prashanth | 26 Oct 2025 11:00 PM ISTసౌత్ సినిమాలు కొత్త కథలతో, రూటెడ్ ఎమోషన్స్‌తో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేస్తుంటే, బాలీవుడ్ మాత్రం ఇంకా ఒకే ఒక్క ఫార్ములాను పట్టుకుని వేలాడుతోంది. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత, 'స్పై యూనివర్స్' అనే ఒక్క ఫార్ములా క్లిక్ అయ్యేసరికి, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దాని చుట్టూనే తిరుగుతోంది. 'టైగర్', 'పఠాన్', 'వార్'.. ఇలా ప్రతీ పెద్ద స్టార్‌ను ఏజెంట్‌గా మార్చేసి, బాక్సాఫీస్ లెక్కల కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
ఈ 'యూనివర్స్' కాన్సెప్ట్ మొదట్లో థ్రిల్లింగ్‌గా అనిపించింది. షారుఖ్ సినిమాలో సల్మాన్, సల్మాన్ సినిమాలో షారుఖ్.. ఈ క్రాసోవర్లు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఇచ్చాయి. కానీ, అదే పనిగా చేస్తుంటే రొటీన్ అనే టాక్ కూడా వస్తోంది. మళ్లీ అవే స్టైలిష్ యాక్షన్ సీన్లు, ఫారిన్ లొకేషన్లు, చివరిలో ఇంకో హీరో క్యామియో.. ఇదే రొటీన్ లూప్‌లో పడిపోయింది హిందీ సినిమా. క్రియేటివిటీ పక్కకు పోయి, కేవలం బ్రాండ్ వాల్యూతో బిజినెస్ చేస్తున్నారు.
ఈ 'స్పై' గోల చాలదన్నట్లు, ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ఈ యూనివర్స్‌ను ఇంకా పెద్దది చేస్తోంది. ఈసారి అలియా భట్, శర్వరీలతో 'ఆల్ఫా' అనే ఫీమేల్ లెడ్ స్పై థ్రిల్లర్‌ను భారీ ఎత్తున లాంచ్ చేసింది. శివ్ రావాయిల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ లాంటి పెద్ద కాస్ట్ కూడా ఉంది. పేపర్ మీద చూస్తే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. కనీసం లేడీ స్పైస్ కథ అయినా కొత్తగా ఉంటుందేమో అని ఆడియెన్స్ ఆశించారు.
కానీ, బాలీవుడ్ మారలేదనడానికి లేటెస్ట్ అప్‌డేటే పెద్ద ప్రూఫ్. 'ఆల్ఫా' సినిమాకు బజ్ తేవడానికి, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ పవర్ సరిపోదన్నట్లు, మళ్లీ పాత హీరోనే రంగంలోకి దించుతున్నారు. 'వార్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఏజెంట్ కబీర్', అంటే హృతిక్ రోషన్, ఈ 'ఆల్ఫా' సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడట. ఇది వినగానే ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నా, అసలు విషయం వేరే ఉంది.
ఇక్కడే బాలీవుడ్ క్రియేటివ్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. 'ఆల్ఫా'ను ఒక ఫ్రెష్, ఇండిపెండెంట్ ఫీమేల్ స్పై థ్రిల్లర్‌గా నిలబెట్టడం లేదు. దాన్ని వెంటనే 'వార్' బ్రాండ్‌కు లింక్ చేస్తున్నారు. అంటే, ఈ లేడీ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే సీనియర్ ఏజెంట్‌గా హృతిక్ కనిపిస్తాడన్నమాట. ఇది కథాపరంగా కాకుండా, మార్కెటింగ్ పరంగా వేసిన ఎత్తుగడ. కొత్త కథపై నమ్మకం లేక, పాత హిట్ సినిమా పేరును, హీరో ఇమేజ్‌ను వాడుకుంటున్నారు.
హృతిక్ ఫ్యాన్స్‌కు ఇది పండగే కావచ్చు. కానీ, కామన్ ఆడియెన్స్‌కు మాత్రం ఇది రొటీన్ వ్యవహారమే. 'ఆల్ఫా' అనేది ఒక కొత్త సినిమా ఫీలింగ్‌ను ఇవ్వకుండా, ఆల్రెడీ నడుస్తున్న 'స్పై యూనివర్స్'లో మరో ఎపిసోడ్‌లా మారింది. బాలీవుడ్ ఇంకా ఆ సేఫ్ జోన్ దాటి బయటకు రాలేదు, కొత్త కథలను నమ్మడం లేదు అనడానికి ఈ 'కబీర్' క్యామియోనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవే సినిమాలు, అవే ఏజెంట్లు.. కొత్త సీసాలో పాత సరుకు.
