Begin typing your search above and press return to search.

ధర్మేంద్ర పై ఫేక్ న్యూస్ స్ప్రెడ్.. ఉద్యోగి అరెస్ట్!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఏర్పడింది.

By:  Madhu Reddy   |   14 Nov 2025 11:09 AM IST
ధర్మేంద్ర పై ఫేక్ న్యూస్ స్ప్రెడ్.. ఉద్యోగి అరెస్ట్!
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉన్నవారిని లేనట్టు.. లేనివారిని ఉన్నట్టు చూపించే ఈ ఆధునిక టెక్నాలజీలో బ్రతికున్న వారిని కూడా చనిపోయినట్టు చూపిస్తూ.. ఆ కుటుంబ సభ్యులకు, ఆ వ్యక్తులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. ఇకపోతే సరిగ్గా ఇలాంటి ఘటన బాలీవుడ్ హీ - మ్యాన్ జీవితంలో చోటుచేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ హీరో ధర్మేంద్రపై ఇలాగే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యి.. యావత్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ వార్త అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది ఎవరు? అని అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడడంతో ఆ వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. విషయంలోకి వెళ్తే.. అక్టోబర్ 31న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లిన ధర్మేంద్ర.. ఆ తర్వాత నవంబర్ 10వ తేదీన మళ్లీ హాస్పిటల్ లో కనిపించడంతో అందరూ కలవర పాటుకు గురయ్యారు. అయితే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిసి.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

అయితే ఇంతలోనే ఆయన మరణించారంటూ ఒక న్యూస్ స్ప్రెడ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా జాతీయ మీడియాలో న్యూస్ రావడంతో అందరూ నిజమనే నమ్మారు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా ధర్మేంద్ర మరణం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. ఇక అలా ఈ వార్తలు బాగా వైరల్ అవ్వడంతో.. కుటుంబ సభ్యుల వరకు చేరిన ఈ విషయాలు వారిని తీవ్రంగా కలవర పాటుకు గురిచేసాయి. ముఖ్యంగా ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ "మా నాన్న చనిపోలేదు" అంటూ స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత హేమమాలిని కూడా.." చికిత్సకు సహకరిస్తున్న వ్యక్తి చనిపోయారని ఎలా డిసైడ్ చేస్తారు?" అంటూ మండిపడింది.

ఇలా ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టించింది. అయితే ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న ధర్మేంద్రను చూసి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉండగా.. ఆసుపత్రి ఉద్యోగి ఒకరు రహస్యంగా ఆయన వీడియోని తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది.. అలా ఆ ఫేక్ న్యూస్ కాస్త స్ప్రెడ్ అవ్వడం సంచలనంగా మారింది. దీంతో వీడియోని తీసిన ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే ఇటీవలే క్షేమంగా ధర్మేంద్ర డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ధర్మేంద్ర డిశ్చార్జ్ అయిన తర్వాత తమకు ప్రైవసీ కావాలని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు.