Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేదికపై రామాయణ ట్రైలర్.. ఎప్పుడంటే?

భారతదేశ అతిపెద్ద సినిమా ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి రామాయణ మూవీని అంతర్జాతీయ వేదికపైన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారనే రూమర్ వినిపిస్తోంది..

By:  Madhu Reddy   |   18 Oct 2025 12:00 AM IST
అంతర్జాతీయ వేదికపై రామాయణ ట్రైలర్.. ఎప్పుడంటే?
X

కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఊరిస్తాయి. ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ లోని రామాయణ మూవీ కూడా ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమాని భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. అలాంటి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురించి తాజాగా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ ట్రైలర్ ని ఆ రోజే విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ రామాయణ ట్రైలర్ ఎప్పుడు విడుదల కాబోతోంది?బీటౌన్ లో వినిపిస్తున్న ఆ రూమర్ ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం..

భారతదేశ అతిపెద్ద సినిమా ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి రామాయణ మూవీని అంతర్జాతీయ వేదికపైన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారనే రూమర్ వినిపిస్తోంది.. అయితే రామాయణ ట్రైలర్ ని కామిక్ కాన్ వేదికగా 2026 జూలైలో విడుదల చేయబోతున్నట్టు బీటౌన్ లో ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.

అయితే రామాయణ ట్రైలర్ ని అక్కడే స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది. అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు సంపాదించిన కామిక్ కాన్ ఈవెంట్లో సినిమాలు ప్రదర్శించినా లేదా ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా అంతర్జాతీయంగా వాటికి పేరు వస్తుంది. అంతర్జాతీయ మీడియా నుంచి మంచి కవరేజ్ లభించడం వల్ల ఇక్కడ ప్రదర్శించే సినిమాలపై ప్రపంచ లెవెల్ లో గుర్తింపు లభిస్తాయి. అందుకే ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్యక్రమంలో రామాయణ ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఇదే సరైన వేదిక అని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే అంతర్జాతీయ వేదిక అయినటువంటి కామిక్ కాన్ ఈవెంట్లో రామాయణ మూవీ ట్రైలర్ ని వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామాయణ మూవీకి నిర్మాతగా చేస్తున్న నమిత్ మల్హోత్రా సంస్థ అనేక ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి హాలీవుడ్ సినిమాల విఎఫ్ఎక్స్ కి వర్క్ చేశారు.

అలా ఆ సినిమాలు చాలావరకు కామిక్ కాన్ లో ప్రదర్శించబడ్డాయి. అందుకే నమిత్ మల్హోత్రా మరియు అతని సంస్థ కామిక్ కాన్ ఈవెంట్లో రామాయణ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట.. అయితే ఈ కామిక్ కాన్ ఈవెంట్లో గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కల్కి 2898AD సినిమా టైటిల్ ని ఆవిష్కరించారు. అలా కామిక్ కాన్ ఈవెంట్లో ఆవిష్కరించిన కల్కి 2898Ad మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా ఈ దారిలోనే రామాయణ మూవీ నిర్మాతలు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రామాయణ మూవీ ట్రైలర్ ని కామిక్ కాన్ ఈవెంట్లో ప్రదర్శిస్తే ఇది అంతర్జాతీయ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని సృష్టించి రామాయణ మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. మరి కామిక్ కాన్ ఈవెంట్ లో రామాయణ ట్రైలర్ నిజంగానే విడుదల చేయబోతున్నారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

రామాయణ మూవీ విషయానికి వస్తే.. నితేష్ తివారి డైరెక్షన్లో సాయి పల్లవి, రణబీర్ కపూర్ లు సీతారాములుగా.. యష్ రావణుడిగా..సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ రామాయణ మూవీని డైరెక్టర్ రెండు పార్ట్ లుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి పార్ట్ వచ్చే ఏడాది అనగా 2026 దీపావళి సందర్భంగా విడుదలవుతుంది.. రెండో పార్ట్ 2027 దీపావళికి విడుదలబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.