Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ దేశాల్లో మారుమ్రోగుతోన్న రాము-రావ‌ణ‌!

మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన రామాయణ గాథను ఆధారం చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణం`.

By:  Srikanth Kontham   |   25 July 2026 9:00 PM IST
ప్ర‌పంచ దేశాల్లో మారుమ్రోగుతోన్న రాము-రావ‌ణ‌!
X

భారతీయ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన రామాయణ గాథను ఆధారం చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణం`. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే చిత్రంలోని ప్రధాన పాత్రలైన రాముడు .. రావణుల గురించిన చర్చ ప్రపంచ దేశాల్లో విపరీతంగా జరుగుతోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ ప్రాజెక్ట్ తెస్తున్న వైబ్రేషన్స్ చూస్తుంటే, భారతీయ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలవడం ఖాయమనిపిస్తోంది.

ఈ చిత్రంలో రాముడి పాత్రను పోషిస్తున్న ర‌ణ‌బీర్ర కపూర్ గెటప్, రావణుడి పాత్ర పోషిస్తున్న య‌శ్ లుక్ ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి. దైవత్వానికి, ధర్మానికి ప్రతీక అయిన రాముడి పాత్ర తాలూకు ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుండగా.. మరోవైపు శక్తికి, అహంకారానికి, అపారమైన విజ్ఞానానికి ప్రతీక అయిన రావణుడి పాత్ర రూపకల్పన ప్రపంచవ్యాప్తంగా సినీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పాత్రల మధ్య జరిగే నైతిక పోరాటం స్వ‌దేశంలోనే కాకుండా విదేశీ ప్రేక్షకులలో కూడా అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులను రంగంలోకి దించారు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ , ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న దృశ్యకావ్యం రామాయణ మహాసారాంశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తోంది. సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకపోయినా? సోషల్ మీడియా వేదికగా లీకైన విజువల్స్ , పోస్టర్లు గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులు పౌరాణిక పాత్రల లోటు పాట్లను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

భారతీయ పురాణాల్లోని పాత్రలను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మలచడంలో నితీష్ తివారీ చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం. రాముడి శాంత స్వభావం, ధర్మనిష్ఠతో పాటు రావణుడిలోని సంక్లిష్టమైన మనస్తత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తున్న తీరు ప్రేక్షకులను కట్టిపడేయనుంది. ఈ రెండు పాత్రల మధ్య వచ్చే సంఘర్షణ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోని థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం భారీ డిమాండ్ ఏర్పడుతోంది.

ఒక పెద్ద ప్రాజెక్ట్ విడుదలకు ముందే ఇలాంటి గ్లోబల్ బజ్ క్రియేట్ చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఇతి హాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పడమే కాకుండా బాలీవుడ్ చిత్రసీమను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. వివిధ దేశాల డిస్ట్రిబ్యూటర్లు సినిమా హక్కులను దక్కించుకోవడానికి ఎగబడుతుండటం చూస్తే ఈ కావ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అర్ద‌మ‌వుతుంది. రాము-రావణ పాత్రల చుట్టూ తిరిగే ఈ కథా సందర్భం అంతర్జాతీయ ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని పంచడం ఖాయం.

మొత్తంగా బాలీవుడ్ రామాయణం సినిమాగా మాత్రమే కాదు. భారతీయ సంస్కృతికి గ్లోబల్ బ్రాండ్‌గా మారుతోంది. రిలీజ్‌కు ముందే ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతోన్న రాముడు, రావణుల పాత్రలు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. రిలీజ్ అనంత‌రం హిట్ అయితే ఆ రెండు పాత్ర‌లు ఇంకే స్థాయిలో సంచ‌ల‌నం అవుతాయో ఊహ‌కి కూడా అందదేమో.