ఒంటరి తనంపై హాట్ లేడీ సంచలన కామెంట్!
బాలీవుడ్ నటి..డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ పూజాభట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈవిడ కూడా కంగన రనౌత్ లాగే ముక్కు సూటి తత్వంగల మహిళ. విషయం ఏదైనా ముఖం మీదనే చెప్పేస్తుంది.
By: Srikanth Kontham | 20 Nov 2025 6:00 PM ISTబాలీవుడ్ నటి..డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ పూజాభట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈవిడ కూడా కంగన రనౌత్ లాగే ముక్కు సూటి తత్వంగల మహిళ. విషయం ఏదైనా ముఖం మీదనే చెప్పేస్తుంది. ఎదుట వారు ఏమనకున్నా? తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తుంది. ఇప్పటికే తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. కుటుంబం గురించి..తనకున్న వ్యసనాల గురించి ఎన్నోసార్లు ఓపెన్ గా మాట్లాడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒంటరి తనం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఒంటరి జీవితమన్నది ఓ శాపం కాదని, ఓ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపింది.
సింగిల్ గా ఉండటం అన్నది ఓ పవిత్రమైన అసైన్ మెంట్ గా భావిస్తానంది. ఎదుట వారి గురించి తనకు అవసరం లేదని..తాను ఎలా ఉన్నాను? అందులో ఎంత నిజాయితీగా ఉన్నాను ? అన్నది ఆలోచిస్తాను తప్ప ఎవరో ఏదో అనుకుంటారని మనసు చంపుకుని ఉండలేనంది. ఒంటరిగా ఉన్న వాళ్ల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుంది? అన్న దాన్ని తాను పట్టించుకోనని...తనకు కావాల్సింది సమాజం నుంచి ఏంటి? అన్న దాని గురించి ఆలోచి స్తానంది. ప్రస్తుత సమాజంలో బలంగా లేకపోతే బ్రతకడం అంత సులభం కాదని అభిప్రాయపడింది.
ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పూజాభట్ ఎప్పుడు ఏం మాట్లాడినా? అది నెట్టింట సంచలనమే. బాలీవుడ్ లో ఆమెను అంతా రియాల్టీ ఉమెన్ అంటారు. పూజాభట్ మాట్లాడే విధానం...జీవనం ఆధారంగానే ఆమెను అలా భావిస్తుంటారు. ఈమె దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.`దిల్ హై కే మాన్తా నహీ`, `సడక్`, `జూనూన్`, `జఖమ్` వంటి చిత్రాలతో మంచి స్టార్ డమ్ అందుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసారు. అటుపై నటిగా విరామం తీసుకున్నారు. ఇటీవలే ఓటీటీ 2 బిగ్ బాస్ తో తెరపైకి వచ్చారు.
ఇదే ఏడాది రిలీజ్ అయిన `బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై` అనే వెబ్ సిరీస్‌లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పూజా భట్ `పంచాయత్` వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన జితేంద్ర కుమార్‌కు మామ్ పాత్రలో ఓ సినిమా చేస్తున్నారు. భారతదేశంలో పావురాలను పెంచి, వాటిని ఎగరవేసే సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. నటీనటుల ఎంపిక జరుగుతోంది. వాటన్నింటిని పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
