Begin typing your search above and press return to search.

సెలీనా గోమేజ్ లుక్స్‌తో న‌ట‌వార‌సురాలు

ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మహిమా చౌద‌రి త‌న కుమార్తె తెరంగేట్రం గురించి ప్ర‌స్థావించారు. ఇప్పుడే ఆరంగేట్రం చేయ‌దు.. కానీ వ‌స్తుంది! అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పారు.

By:  Sivaji Kontham   |   25 Dec 2025 8:30 AM IST
సెలీనా గోమేజ్ లుక్స్‌తో న‌ట‌వార‌సురాలు
X

బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ ఆగ‌డం లేదు. అంత‌కంత‌కు కొత్త త‌రం న‌టీన‌టులు వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతూనే ఉన్నారు. ఇటీవ‌లే ఖుషి క‌పూర్, స‌నాయ క‌పూర్, సుహానా ఖాన్ లాంటి న‌టీమ‌ణులు క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసారు. ఇప్పుడు న‌టి మ‌హిమా చౌద‌రి కుమార్తె అరియానా చౌద‌రి బాలీవుడ్ లో త‌న ల‌క్ చెక్ చేసుకోబోతోంది.

సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా పరిచయమైన `నదానియాన్` ప్రీమియర్‌కు ఈ తల్లి-కూతుళ్లు హాజరైనప్పుడు మీడియా దృష్టిని ఆక‌ర్షించారు. ఈ వేడుక‌లో అరియానా ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. త‌న అందం క్యూట్ లుక్స్ గుబులు పుట్టించాయి. ఆ త‌ర్వాత అరియానా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఈ యువ నటిని అమెరికన్ గాయని, నటి సెలెనా గోమెజ్‌తో పోల్చారు అరియానా యువ‌త‌రం హృదయాలను గెలుచుకుంది. తన తల్లి అడుగుజాడల్లో నడుస్తుందా లేదా అనే దానిపై చర్చలకు దారితీసింది.

ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మహిమా చౌద‌రి త‌న కుమార్తె తెరంగేట్రం గురించి ప్ర‌స్థావించారు. ఇప్పుడే ఆరంగేట్రం చేయ‌దు.. కానీ వ‌స్తుంది! అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పారు. ``నాకు సినిమాలు అంటే ఇష్టం.. సృజనాత్మకత అంటే ఇష్టం.. అరియానా నా చరిత్రలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను`` అని అన్నారు. నా జీవితంలో ఏం చేసినా అది ఇక్క‌డే. ముంబైలాంటిది వేరొక‌టి లేదు కాబట్టి ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నానని అన్నారు తన కుమార్తె పరిశ్రమలోకి రావడానికి తాను తొందరపడటం లేదని, న‌ట‌నా కెరీర్ ని ఎంచుకుంటే మనస్ఫూర్తిగా మద్ధ‌తు ఇస్తానని మ‌హిమ తెలిపారు.

అరియానా కిల్ల‌ర్ లుక్స్ కి ఇంటర్నెట్ షేక‌వుతోంది. చూడ‌గానే సెలీనా గోమేజ్ క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టుగా ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. అభిమానుల ఫేవరెట్‌గా మారింది ఈ క్యూటీ. అరియానా త‌న‌ తల్లికి జిరాక్స్ కాపీ అని కొంద‌రు వ్యాఖ్యానించారు. చాలా మంది సెలెనా గోమెజ్‌తో ఉన్న అద్భుతమైన పోలికను కూడా గుర్తించారు. ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ.. డిస్నీలో ప్రారంభ రోజుల్లో ఉన్న సెలెనా లాగా కనిపిస్తుంది! అని రాశారు.

అరియానా బాలీవుడ్ ఆరంగేట్రం ఎప్పుడు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. ఆరంగేట్రం ఇప్పుడప్పుడే జరిగే అవకాశం లేద‌ని మహిమా వ్యాఖ్యలు చెబుతున్నాయి. భవిష్యత్తులో తన న‌ట‌వార‌స‌త్వాన్ని కుమార్తెకు అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టమవుతోంది.

మహిమా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, చివరిగా సంజయ్ మిశ్రాతో కలిసి `దుర్లభ్ ప్రసాద్ కి దూస్రీ షాదీ` చిత్రంలో కనిపించారు. ఇది ఈ డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో `నదానియాన్` చిత్రంలో న‌టించింది. ఇందుల‌ ఖుషీ కపూర్ కి తల్లి పాత్రను పోషించారు.