Begin typing your search above and press return to search.

యాక్షన్ చిత్రాలలో పస లేకుండా పోతోందే!

అయితే కింగ్ మూవీ గ్లింప్స్, టైటిల్ తాజాగా విడుదలైనప్పటికీ ఈ యాక్షన్ మూవీపై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు.

By:  Madhu Reddy   |   5 Nov 2025 3:00 PM IST
యాక్షన్ చిత్రాలలో పస లేకుండా పోతోందే!
X

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ రీసెంట్ గా తన 60బర్త్ డే ని జరుపుకున్నారు. అయితే షారుక్ ఖాన్ బర్త్ డే రోజు ఆయన నటిస్తున్న తాజా మూవీ కింగ్ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా పటాన్ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ షారుక్ ఖాన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా భారీ యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది.

అయితే కింగ్ మూవీ గ్లింప్స్, టైటిల్ తాజాగా విడుదలైనప్పటికీ ఈ యాక్షన్ మూవీపై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. అయితే కింగ్ మూవీ ద్వారా షారుక్ ఖాన్ ఏం చేయబోతున్నారు అనేది కొంతమందిలో ఆసక్తిగా ఉన్నప్పటికీ మరి కొంత మంది సినీ ప్రేమికులు మాత్రం బాలీవుడ్ ఫిలిమ్స్ యాక్షన్ శైలిని కోల్పోయిందని, చాలా రోజుల నుండి బాలీవుడ్ యాక్షన్ ఫిలిమ్స్ ఒకప్పటిలా ఉండడం లేదని భావిస్తున్నారు. భావోద్వేగపరంగా సినిమా చాలా మారిందని అంటున్నారు.

గతంలో వచ్చే యాక్షన్ చిత్రాలు ఎంతో మంది ప్రేక్షకులను అలరించేవి. అయితే ఇప్పుడు ఎంతో అధునాతన టెక్నాలజీ మరియు విజువల్స్ ఉన్నా కూడా వాటిని బాలీవుడ్ యాక్షన్ సినిమాలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని కొంతమంది ప్రేక్షకులు బాధపడుతున్నారు. ఒకప్పుడు యాక్షన్ సినిమా అయినా ఎమోషనల్ మూవీ అయినా సరే అందులో ఉండే ప్రతి ఒక్క మూమెంట్ ప్రేక్షకుడిని కట్టిపడేసి అనుభూతి చెందేలా చేసేవి. కానీ ఇప్పుడు అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు హై అండ్ వీఎఫ్ఎక్స్ ఉన్నప్పటికీ చాలా సినిమాలు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడంలో విఫలమవుతున్నాయి.

యాక్షన్ సినిమాలో ఆధునికత కనిపిస్తున్నప్పటికీ అది పరిపూర్ణంగా లేదని కొంతమంది సినీ ప్రేమికుల వాదన. అంతేకాదు అప్పట్లో యాక్షన్ సినిమాల్లో పోరాట సన్నివేశాలు అద్భుతంగా కనిపించేవి. కానీ ఇప్పుడు వచ్చే యాక్షన్ సినిమాల్లో ఎడిటింగ్,యాంత్రిక కదలికలతోనే భర్తీ చేస్తున్నారు. హీరో పోరాట దృశ్యాలు మసకబారిపోతున్నాయి. యాక్షన్ సినిమాలు కాలం మారుతున్న కొద్ది మరింత అద్భుతంగా వస్తాయని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రేక్షకులు అనుకున్నట్లుగా యాక్షన్ సినిమాలు ఉండడం లేదు. పైగా అప్పట్లో క్రైమ్ మాస్టర్ గోగో, గబ్బర్ వంటి విలన్లు అద్భుతంగా నటించారు.

కానీ ఇప్పటి జనరేషన్ విలన్లు ఆ స్థాయికి వెళ్లడం లేదు. ఇక ఇప్పటి యాక్షన్ సినిమాల్లో హీరో కోపం వెనక ఉద్దేశం ఏంటో కూడా సరిగ్గా చూపించడం లేదు. ఒక యాక్షన్ సినిమా సక్సెస్ అవ్వాలంటే దానిమీద నిర్మాతలు, నటీనటులు నమ్మకం పెట్టుకోవడం చాలా అవసరం. ఆ నమ్మకం లేనప్పుడు ప్రేక్షకులకు కూడా యాక్షన్ మూవీ కనెక్ట్ అవ్వదు. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కోసం కాకుండా కథ,కంటెంట్, ఎమోషన్స్ తో ఉండే నిజమైన యాక్షన్ సినిమాలు మళ్లీ రావాలని కొంతమంది బాలీవుడ్ సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ సినిమాల్ని మళ్లీ దర్శకులు తీయగలుగుతారా.. సినీ ప్రేక్షకుల కోరిక తీర్చుతారా అనేది చూడాలి.