ఒకే వేదికపై ముగ్గురు సూపర్ స్టార్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేర్లు సల్మాన్ ఖాన్,షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. ఈ ముగ్గురి పేర్లే అందరికీ గుర్తుకు వస్తాయి.
By: Madhu Reddy | 12 Oct 2025 1:36 PM ISTఅభిమాన నటీనటులు అందరూ ఒకే వేదికపై కనిపిస్తే ఆ అభిమానులకి అంతకంటే సంతోషం ఉండదు. అందర్నీ ఒకేసారి ఒకే దగ్గర చూస్తే అభిమానులకి పండగే. అయితే అలాంటి ఒక కన్నుల విందైన పండుగని మనం త్వరలోనే చూడబోతున్నాం.. ఏకంగా ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు..మరి ఇంతకీ ఒకే వేదికపై కలుసుకోబోతున్న ఆ ముగ్గురు సూపర్ స్టార్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేర్లు సల్మాన్ ఖాన్,షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. ఈ ముగ్గురి పేర్లే అందరికీ గుర్తుకు వస్తాయి. పైగా ఈ ముగ్గురు కూడా బాలీవుడ్ లో దిగ్గజ స్టార్లు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలడమే కాదు ఇప్పటికీ కూడా తమ స్టార్డంని కొనసాగిస్తున్నారు.. 60 ఏళ్ల వయసు మీద పడినా కూడా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ఏ కాస్త ఛాన్స్ దొరకకుండా తమ కెరియర్ ని కాపాడుకుంటూ ఇండస్ట్రీలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. అయితే అలాంటి ఈ ముగ్గురు హీరోలకు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియా వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా పేరున్న ఈ ముగ్గురు హీరోలను ఒకే దగ్గర చూస్తే ఆ అభిమానుల ఉత్సాహం ఇంకా ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్ లు అక్టోబర్ 17న ఓకే వేదికపై కనిపిస్తున్నారట. అది ఎక్కడంటే.. ఈ నెల అనగా అక్టోబర్ 17న సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగే జాయ్ ఫోరమ్ 2025కి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఒకే వేదికని పంచుకోనున్నారు..
జాయ్ ఫోరమ్ 2025 అనేది సౌదీ అరేబియాలోని వినోద పరిశ్రమ వృద్ధి, సక్సెస్ లకు సంబంధించిన ఓ ఈవెంట్.. అయితే ఈ మెగా ఈవెంట్ ఈసారి సౌదీ అరేబియాలోని రియాద్ లో జరుగబోతుంది. ఈ జాయ్ ఫోరమ్ 2025 ఈవెంట్ లో బాలీవుడ్ నుండి ఈ ముగ్గురు సూపర్ స్టార్ లతో పాటు ఇతర ప్రపంచ ప్రముఖులు అయినటువంటి మిస్టర్ బీస్ట్, డానా వైట్, గ్యారీ వీ, పియర్స్ మోర్గాన్ తోపాటు మరి కొంతమంది ప్రముఖులు హాజరవ్వబోతున్నారు.. అయితే ఈ మెగా ఈవెంట్లో బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకే వేదికను పంచుకోవడంతో వీరి అభిమానులు ఆ అద్భుతమైన దృశ్యం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ముగ్గురు హీరోలు కలిసి రీసెంట్ గా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో గెస్ట్ రోల్స్ లో మెరిసారు. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ ముగ్గురు హీరోల నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ మూవీ కింగ్ షూటింగ్లో ఉండగా.. అమీర్ ఖాన్ ఇప్పటివరకు తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఆయన నటించిన సితారే జమీన్ పర్ మూవీ విడుదలై ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది.
