కెరియర్ పై ఫోకస్.. లేట్ ప్రెగ్నెన్సీ.. నష్టమా? లాభమా?
సినీ పరిశ్రమలో ఒకప్పుడు పెళ్లి, పిల్లలు అంటే హీరోయిన్ల కెరియర్ ముగిసిపోయినట్లే అనే భావన ఉండేది.
By: Madhu Reddy | 12 Sept 2026 4:00 PM ISTసినీ పరిశ్రమలో ఒకప్పుడు పెళ్లి, పిల్లలు అంటే హీరోయిన్ల కెరియర్ ముగిసిపోయినట్లే అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది! మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నేటి తరం నటీమణులు తమ కెరియర్‌పై పూర్తి ఫోకస్ పెట్టి, లైఫ్‌లో సెటిల్ అయ్యాకే మాతృత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 దాటిన తర్వాత లేదా 40 ఏళ్ల వయసులో (లేట్ ప్రెగ్నెన్సీ) పిల్లల్ని కంటూ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. ఈ ధోరణి వెనుక ఉన్న కారణాలు, లాభనష్టాలపై ఓ లుక్ వేద్దాం..
లేట్ ప్రెగ్నెన్సీతో ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్స్:
సమంత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని కెరియర్, పర్సనల్ లైఫ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ప్రెగ్నెన్సీని ప్రకటించగా, బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో మాతృత్వాన్ని పొందింది. ఇక కరీనా కపూర్ ఖాన్ 36 ఏళ్లలో మొదటి బిడ్డకు, 40 ఏళ్లలో రెండో బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా గర్భంతో ఉన్నప్పుడు కూడా షూటింగుల్లో పాల్గొంది. ఇక బిపాసా బసు 47 ఏళ్ల వయసులో కూతురు దేవికి జన్మనివ్వగా, అంతర్జాతీయ పాప్ స్టార్ లేడీ గాగా 40 ఏళ్ల వయసులో తల్లై వార్తల్లో నిలిచారు.
ఆర్థిక, వృత్తిపరమైన స్థిరత్వమే ముఖ్యం:
గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నటీమణులు చిన్న వయసులోనే స్టార్‌డమ్‌తో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోకుండా, అన్ని విధాలా సెటిల్ అయ్యాక మాతృత్వం వైపు అడుగులేస్తున్నారు.
మానసిక మెచ్యూరిటీ & బాధ్యత పెరగడం:
వయసుతో పాటు వచ్చే మానసిక పరిపక్వత జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మానసికంగా, ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నాక పిల్లల్ని కంటే వారికి అత్యుత్తమ భవిష్యత్తును ఇవ్వగలమనే నమ్మకం నేటి నటీమణుల్లో బాగా పెరుగుతోంది. అందుకే బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మారడానికి ఈ లేట్ ప్రెగ్నెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రెగ్నెన్సీలోనూ వర్క్ మోడ్.. తగ్గేదేలే!:
ఒకప్పుడు గర్భం దాల్చగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసేవారు. కానీ నేటి తరం నటీమణులు అలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీ గర్భవతులుగా ఉన్న సమయాల్లోనూ షూటింగులు, ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా డెలివరీ అయిన అతి తక్కువ సమయంలోనే ఫిట్‌నెస్ సాధించి తిరిగి రీ-ఎంట్రీ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వైద్యపరంగా లేట్ ప్రెగ్నెన్సీలో కొన్ని సవాళ్లు, జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఆధునిక వైద్య సౌకర్యాల వల్ల దాన్ని సురక్షితంగా మలుచుకుంటున్నారు. కెరియర్ స్థిరత్వం, మానసిక పరిపక్వత లభిస్తుండటంతో ఈ ట్రెండ్ నటీమణులకు ప్రయోజనకరంగానే మారింది. ఇక వ్యక్తిగత ఎదుగుదలతో పాటు మాతృత్వాన్ని కూడా విజయవంతంగా ఆస్వాదించవచ్చని నేటి వీరనారులు స్పష్టంగా నిరూపిస్తున్నారు
