Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ భామల హవా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న క్రేజీ హీరోయిన్లు!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం హీరోల సినిమాలకే వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయని అనుకునేవారు.

By:  Madhu Reddy   |   20 May 2026 3:00 PM IST
బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ భామల హవా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న క్రేజీ హీరోయిన్లు!
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం హీరోల సినిమాలకే వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయని అనుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమ స్టార్ పవర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. దీపికా పడుకొనే రూ. 1050 కోట్లు, సారా అర్జున్ ఏకంగా రూ. 1902 కోట్ల కలెక్షన్లతో టాప్‌లో దూసుకుపోతున్నారు. వీరితో పాటు ఆలియా భట్, కత్రినా కైఫ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా భారీ వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

బాక్సాఫీస్ లీడర్లుగా దీపికా, అలియా, కత్రినా:

ప్రస్తుతం బాలీవుడ్‌లో దీపికా పడుకొనే, ఆలియా భట్, కత్రినా కైఫ్ లాంటి టాప్ స్టార్స్ కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. వీరు నటించిన సినిమాలు కేవలం ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి.ఇక పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు, స్టార్ హీరోల ప్రాజెక్ట్స్‌లో భాగం అవుతూ ఈ భామలు తమ మార్కెట్ స్టామినాని విపరీతంగా పెంచేసుకున్నారు.

రూ. 1050 కోట్లతో దీపికా పడుకొనే హవా:

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ దీపికా పడుకొనే కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జవాన్ ,కల్కి ఇప్పుడు రాక ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, రీసెంట్ టైమ్స్‌లో భారీ కలెక్షన్లు పొందిన చిత్రాల్లో నటించింది. ఇక తన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ, దాదాపు రూ. 1050 కోట్ల మార్క్‌ను దాటేసి బాక్సాఫీస్ క్వీన్‌గా నిలిచింది.

రూ. 1902 కోట్లతో సారా అర్జున్ సంచలనం:

ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ధురంధర్ లాంటి పెద్ద సినిమాలో భాగమవుతూ యంగ్ బ్యూటీ సారా అర్జున్ కలెక్షన్ల లెక్కలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పాన్-ఇండియా సినిమాలు, భారీ ఫ్రాంచైజీ చిత్రాల వల్ల ఈమె ఖాతాలో ఏకంగా రూ. 1902 కోట్ల భారీ కలెక్షన్లు చేరిపోయాయి. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నటీమణుల లిస్టులో ఈమె పేరు టాప్ లో వినిపిస్తోంది.

పెరిగిన ఫీమేల్ స్టార్ పవర్:

ఒకప్పుడు హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యేవి. కానీ, ఇప్పుడు రూట్ మారింది. ఫ్రాంచైజీ సినిమాలు, బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్, అలాగే పాన్-ఇండియా సినిమాలు హీరోయిన్ల కెరీర్ టోటల్స్ ను ఊహించని రేంజ్‌కు తీసుకెళ్తున్నాయి. ఇక హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించగలరని ఈ కలెక్షన్ల లెక్కలు నిరూపిస్తున్నాయి.

మొత్తానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేస్తున్నారు. కోట్లకు కోట్లు వసూలు చేస్తూ సినిమాల్లో ఫీమేల్ స్టార్ పవర్ వాల్యూ ఏంటో చూపిస్తున్నారు. దీపికా పడుకొనే, సారా అర్జున్ లాంటి స్టార్స్ క్రియేట్ చేసిన ఈ రికార్డులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో హీరోయిన్స్ సినిమాలు మరిన్ని వందల కోట్ల క్లబ్‌లో చేరుతాయి అనటం లో ఆశ్చర్యం లేదు.