Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో శ్రీలీలకు మొదటి అడుగే అగ్నిపరీక్షలా మారిందా?

శ్రీలీల బాలీవుడ్ జ‌ర్నీ మొద‌ల‌వడానికి ముందే అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోతో భారీ ప్రచారంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 July 2026 8:14 PM IST
బాలీవుడ్‌లో శ్రీలీలకు మొదటి అడుగే అగ్నిపరీక్షలా మారిందా?
X

శ్రీలీల బాలీవుడ్ జ‌ర్నీ మొద‌ల‌వడానికి ముందే అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోతో భారీ ప్రచారంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అయితే శ్రీలీల విషయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. మొదట ఒక ప్రాజెక్ట్‌తో ప్రారంభమవుతుందని భావించిన ప్రయాణం ఇప్పుడు మరో సినిమా వైపు మళ్లే పరిస్థితి కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొద‌ట్లో కార్తిక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు తెరకెక్కించనున్న రొమాంటిక్ డ్రామానే శ్రీలీలకు బాలీవుడ్ డెబ్యూ సినిమాగా భావించారు. కానీ ఆ ప్రాజెక్టుకు వ‌రుస డిలేలు ఎదురవుతుండటంతో, ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా రూపొందుతున్న దిలేర్ తో ఆమె బాలీవుడ్ అరంగేట్రం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవైపు చూస్తే ఇది శ్రీలీల ఎదురుచూపులకు ముగింపు పలికే అవకాశం. చాలా కాలం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కాని సినిమా కోసం వెయిట్ చేయ‌డం కంటే, త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడం ఒక ప్లస్‌గా భావించవచ్చు. అయితే మరోవైపు ఈ డెబ్యూ ఛేంజ్ కొత్త ఛాలెంజెస్‌ను కూడా తీసుకొస్తోంది. ఎందుకంటే డెబ్యూ సినిమాకు హీరో మార్కెట్, సినిమా చుట్టూ ఉండే బజ్, నిర్మాతల బ్రాండ్ వంటి అంశాలు కెరీర్ తొలి ముద్రపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

కార్తిక్ ఆర్యన్ ఇటీవలి సినిమాల ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో అత‌నికంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అలాంటి హీరోతో లాంచ్ కావడం ఒక రకమైన భరోసా ఇస్తుంది. మరోవైపు ఇబ్రహీం అలీ ఖాన్ ఇంకా థియేటర్లలో తన మార్కెట్‌ను నిరూపించుకోవాల్సిన దశలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలీల డెబ్యూ ఫాస్ట్ గా జరిగిన‌ప్ప‌టికీ, దానికి ఆడియ‌న్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుందా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. అయితే ఈ పరిస్థితిని కేవలం రిస్క్‌గా మాత్రమే చూడలేం. ఇటీవల బాలీవుడ్‌లో కథ, డైరెక్ట‌ర్, నిర్మాణ సంస్థలపై ప్రేక్షకులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. హీరో కొత్తవాడైనా, కంటెంట్ బలంగా ఉంటే సినిమాలు స‌క్సెస్‌లు సాధించిన ఉదాహరణలున్నాయి. అదే సమయంలో స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమా స‌క్సెస్ అవుతుందనే గ్యారెంటీ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే శ్రీలీల కూడా తన కెరీర్‌లో వేగం కంటే సరైన ప్రాజెక్ట్ ఎంపికకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

వాస్తవానికి బాలీవుడ్‌లో ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కావు. షూటింగ్ డిలేస్, రిలీజ్ వాయిదాలు, నటీనటుల డేట్ల సమస్యలు లేదా మార్కెట్ పరిస్థితుల కారణంగా హీరోయిన్ల తొలి సినిమాలు మారిపోయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అందుకే ప్రస్తుతం నిర్మాతలు ఒకే ప్రాజెక్ట్‌పై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సినిమా నిలిచిపోతే మరో అవకాశాన్ని రెడీగా ఉంచడం ఇప్పుడు కొత్త వ్యూహంగా మారుతోంది.

శ్రీలీల జ‌ర్నీ కూడా అదే మార్పుకు ప్రతిబింబంలా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో తొలి అడుగు వేయడం మాత్రమే కాదు, సరైన టైమ్ లో సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంత కీలకమో ఆమె పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. డెబ్యూ ఏ సినిమాతో జరిగినా, ఆ తర్వాత తన యాక్టింగ్ తోనే అక్కడ స్థిరపడాల్సి ఉంటుందనే వాస్తవం మాత్రం మారదు. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ఈ మలుపు, ఒక హీరోయిన్ తొలి అవకాశం ఎంత క్లిష్టమైన డెసిష‌న్స్ తో ముడిపడి ఉంటుందో చెప్పే తాజా ఉదాహరణగా నిలుస్తోంది.వాస్తవానికి బాలీవుడ్‌లో ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కావు. షూటింగ్ డిలేస్, రిలీజ్ వాయిదాలు, నటీనటుల డేట్ల సమస్యలు లేదా మార్కెట్ పరిస్థితుల కారణంగా హీరోయిన్ల తొలి సినిమాలు మారిపోయిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అందుకే ప్రస్తుతం నిర్మాతలు ఒకే ప్రాజెక్ట్‌పై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సినిమా నిలిచిపోతే మరో అవకాశాన్ని రెడీగా ఉంచడం ఇప్పుడు కొత్త వ్యూహంగా మారుతోంది.

శ్రీలీల జ‌ర్నీ కూడా అదే మార్పుకు ప్రతిబింబంలా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో తొలి అడుగు వేయడం మాత్రమే కాదు, సరైన టైమ్ లో సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంత కీలకమో ఆమె పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. డెబ్యూ ఏ సినిమాతో జరిగినా, ఆ తర్వాత తన యాక్టింగ్ తోనే అక్కడ స్థిరపడాల్సి ఉంటుందనే వాస్తవం మాత్రం మారదు. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ఈ మలుపు, ఒక హీరోయిన్ తొలి అవకాశం ఎంత క్లిష్టమైన డెసిష‌న్స్ తో ముడిపడి ఉంటుందో చెప్పే తాజా ఉదాహరణగా నిలుస్తోంది.