డైరెక్టర్లు అక్కడి హీరోలను పట్టించుకోవడం మానేశారా?
మిగిలిన దర్శకులు సైతం బాలీవుడ్ హీరోలను పట్టించుకోకుండా కేవలం తెలుగు హీరోల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
By: Gopi Velupala | 24 Sept 2026 6:00 PM ISTప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులందరు ఆ సినిమాలను చూసి దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాలను తీయాలనుకునే ప్రతి ఒక్క దర్శకుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. బాలీవుడ్ దర్శకులు సైతం డిఫరెంట్ సినిమాలను చేయాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికి వారి నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఇండియా వైడ్ గా తెలుగు సినిమాలకి ఎక్కువగా ప్రాముఖ్యత లభిస్తుంది. తద్వారా మన సినిమాలను చూడడానికి ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం... గత సంవత్సరం వచ్చిన 'దురంధర్' రెండు పార్టులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొట్టాయి. బాలీవుడ్ లో ఉన్న దర్శకులలో 'ఆదిత్య ధర్' ఒక్కడే ఈ మధ్యకాలంలో సాలీడు సక్సెస్ లను సాధించాడు. అతడిని మినహాయిస్తే మిగిలిన వారెవరు కూడా విజయాలను అందుకోలేకపోతున్నారు. దానికి తోడుగా బాలీవుడ్ డైరెక్టర్లు సైతం అక్కడి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే పనవదని తెలుగు హీరోల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 'సంజలీలా భన్సాలీ' లాంటి దర్శకుడు సైతం 'మహేష్ బాబు 'తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఆదిత్య ధర్ సైతం ప్రభాస్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మిగిలిన దర్శకులు సైతం బాలీవుడ్ హీరోలను పట్టించుకోకుండా కేవలం తెలుగు హీరోల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రస్తుతం తెలుగు హీరోలకి ప్రపంచ స్థాయి మార్కెట్ ఏర్పడింది... బాలీవుడ్ హీరోలకి సైతం భారీ స్థాయిలో మార్కెట్ ఉన్నప్పటికి ఈ మధ్యకాలంలో వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో వాళ్ల క్రేజ్ కొంత వరకు తగ్గుతూ వస్తుంది. తద్వారా ఫామ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన హీరోలను టార్గెట్ చేసుకొని బాలీవుడ్ డైరెక్టర్లు ముందుకు సాగుతున్నారు. మన హీరోల కోసమే వాళ్లు కథలను రెడీ చేస్తుండటం విశేషం...
ఇక ఇలాంటి క్రమంలో మన హీరోలు సైతం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఓమ్ రావత్ ప్రభాస్ తో చేసిన 'ఆది పురుషు' సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దానికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా చేసినప్పటికి అతనికి భారీ డిజాస్టర్ దక్కింది తప్ప ఎన్టీఆర్ కి ఆ మూవీతో వచ్చిన లాభమైతే ఏమీ లేదు. కాబట్టి బాలీవుడ్ దర్శకుల నుంచి వచ్చే కథల విషయంలో మన హీరోలు కొంతవరకు స్పెషల్ కేర్ తీసుకొని కథలు పర్ఫెక్ట్ గా కుదిరితే సినిమాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం వారిని వీలైనంత వరకు పక్కన పెడితేనే బాగుంటుందనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి...
