Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో కొత్త మాఫియా.. క్రిటిక్స్ ను అలా చేసేస్తున్నారా

కాపీరైట్ మాఫియా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. నిజాయితీగా రివ్యూలు ఇచ్చేవారి పై ఈ కాపీరైట్ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే వారి ప్రధాన పాత్ర.

By:  M Prashanth   |   16 Sept 2025 12:00 AM IST
బాలీవుడ్ లో కొత్త మాఫియా.. క్రిటిక్స్ ను అలా చేసేస్తున్నారా
X

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తరచుగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండేవి. కానీ ఇటీవల సంవత్సరాలలో మాఫియా అనే పదం తెరపై కాదు.. ఏకంగా పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. కాపీరైట్ మాఫియా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. నిజాయితీగా రివ్యూలు ఇచ్చేవారి పై ఈ కాపీరైట్ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే వారి ప్రధాన పాత్ర.

అనేక మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రిటిక్స్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తే, కాపీరైట్ స్టైక్స్ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంటెంట్‌ను రక్షించడానికి బదులుగా, ఈ టాల్ ను ఇప్పుడు జెన్యూన్ రివ్యూలు ఇచ్చేవారిని తొక్కేయడానికి ఉపయోగిస్తున్నారనే వాదనలు ఎక్కువవుతున్నాయి. రివ్యూవర్లు జెన్యూన్ రివ్యూలు ఇచ్చినప్పుడు అలాంటి క్రిటిక్స్ ను కొన్ని పవర్ఫుల్ నిర్మాణ సంస్థలు బ్లాక్ చేస్తున్నాయి. ఈ వ్యవస్థ ఇంకా డీప్ గా వెళ్తుందని పరిశీలకులు కూడా ఆరోపిస్తున్నారు.

IMDB, గూగుల్, బుక్ మై షో వంటి సైట్‌ లను 10/10 ఫేక్ రేటింగ్‌ లతో మేకర్స్ నింపుతారు. అలాగే సోషల్ మీడియాలో, సేమ్ ఆడియెన్స్ రియాక్షన్లను వేర్వేరు వీడియోల్లో చూపించి మనిపులేట్ చేస్తారు. ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీలు. ఇలా లేనిది ఉన్నట్ట కల్పించేందుకు మార్కెటింగ్ ఏజెన్సీలకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. అయితే నిజమైన విమర్శకులను మాత్రం కాపీరైట్ స్ట్రైక్స్ తో దెబ్బతీస్తున్నారు.

ఈ ద్వంద్వ వైఖరీ సినిమా ప్రమోషన్లు, రివ్యూలపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా తారుమారు చేస్తారని నమ్ముతారు. నిర్మాతలు చెప్పే సంఖ్యకు.. ట్రేడ్ విశ్లేషకులు చెప్పే వసూళ్లకు ఒక్కోసారి పొంతన కుదరదు. ఇందులో చాలా తేడాలు ఉంటాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇంలాటి క్లైమ్స్ చేస్తారు. ఇక టికెట్ అమ్మకాలు, ఆక్యుపెన్సీ రేట్లు తరచుగా రియాలిటీని చూపుతాయి.

ఇటీవలి సంవత్సరాలలో అనుమానాస్పద ప్రీ- బుకింగ్స్ కూడా ఉన్నట్లు గమనించిరు. నెంబర్లను పెంచేసి సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది అని ప్రేక్షకులకు ఓ భ్రమ క్రియేట్ చేస్తారు. అయితే భారతీయ చట్టం ప్రకారం.. సినిమా రివ్యూలను చెప్పే క్రమంలో క్రిటిక్స్ సినిమా పోస్టర్లు, క్లిప్స్, కామెంటరీ సౌండ్ వాడుకోవచ్చు. కానీ, క్రిటిక్స్ ను సైలెంట్ చేయడానికి వారిపై అన్యాయంగా స్టైక్స్, కాపీరైట్ ఉపయోగిస్తున్నారు.

ఇధి మాట్లాడే స్పేచ్ఛను దెబ్బతీస్తుంది. బాలీవుడ్ లో క్రెడిబిలిటీ ఉండాలంటే, అది ప్రశంసలతో పాటు విమర్శలను స్వీకరించాలి. అప్పుడే పరిశ్రమ నమ్మకం పునర్నిర్మించుకుని నిజాయితీగా వృద్ధి చెందగలదు.