Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఆడియన్స్ సూపర్ జడ్జిమెంట్..!

ఐతే సైయారా.. మహావతార్ సినిమాల రిజల్ట్ చూస్తే బాలీవుడ్ ఆడియన్స్ కూడా కొత్త కంటెంట్ ని కోరుతున్నారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   16 Aug 2025 8:00 PM IST
బాలీవుడ్ ఆడియన్స్ సూపర్ జడ్జిమెంట్..!
X

సినిమా ఏ భాషలో రిలీజైన ఆడియన్స్ కి నచ్చితే మాత్రం అది సూపర్ హిట్ అన్నట్టే. కంటెంట్ బాగుండి.. పర్ఫెక్ట్ మేకింగ్ తో సినిమా తీస్తే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు జరిగేదే కానీ మూస పద్ధతిలో సినిమాలు చేస్తూ కొద్దిగా కొత్త కంటెంట్ సినిమాలు వస్తే.. అవి చేసే అద్భుతాలు గురించి స్పెషల్ డిస్కషన్ చేస్తుంటారు. ప్రస్తుతం బీ టౌన్ లో ఇదే జరుగుతుంది.

స్టార్ సినిమాలేమో బోల్తా కొడుతుంటే..

బాలీవుడ్ ఆడియన్స్ జడ్జిమెంట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ స్టార్ సినిమాలేమో బోల్తా కొడుతుంటే కంటెంట్ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్లు కొడుతున్నాయి. ఈమధ్య బాలీవుడ్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సైయారా. అంచనాలు పెద్దగా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. ఐతే ఈ సినిమాలో ఫ్రెష్ లవ్ స్టోరీ, అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్ అన్నీ కూడా ఆడియన్స్ కు బాగా నచ్చాయి. అందుకే ఈ సినిమాను అక్కడ అందరికీ నచ్చేసింది.

ఇక సినిమాకు సూపర్ అనే టాక్ వస్తే వసూళ్లు వాతంటికి అవే వస్తాయి. సైయరా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా బీ టౌన్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాతో పాటు మహావతార్ నరసింహ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ పై బీభత్సం సృష్టిస్తుంది. యానిమేషన్ సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ ఎక్స్ పీరియన్స్ పొందుతున్నారు.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వండర్స్..

ఐతే సైయారా.. మహావతార్ సినిమాల రిజల్ట్ చూస్తే బాలీవుడ్ ఆడియన్స్ కూడా కొత్త కంటెంట్ ని కోరుతున్నారని తెలుస్తుంది. రొటీన్ కంటెంట్.. రెగ్యులర్ ఫార్మెట్ సినిమాలను అక్కడ వాళ్లు కూడా కాదనేస్తున్నారు. ఈమధ్య సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సృష్టిస్తున్నాయి. వాటికి తగిన రిజల్ట్ అక్కడి సినిమాలు అందుకోలేకపోతున్నాయి.

కానీ బాలీవుడ్ లో ఏదైనా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అది వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు అది ప్రూవ్ చేశాయి. ఐతే అక్కడ స్టార్ సినిమాలు మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటున్నాయి. బాలీవుడ్ హీరోలు సైతం ఈ విషయంపై చాలా తర్జన భర్జనలో ఉన్నారు.

ఇక ఈ గ్యాప్ లో బీ టౌన్ ఆడియన్స్ సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేషనల్ లెవెల్ లో రిలీజైన ప్రతి సినిమాకు మంచి స్కోప్ ఏర్పడుతుంది. మరి బాలీవుడ్ లో రాబోతున్న సినిమాలతో అయినా వాళ్లు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.