Begin typing your search above and press return to search.

పాపరాజీలు ఫ్రీగానే వస్తారా? ఈ విషయం తెలుసా?

అంతకుముందు.. బీటౌన్ సినీ ఇండస్ట్రీలో పాప్ లు ఒక ముఖ్యమైన భాగమని నటి హ్యూమా ఖురేషీ చెప్పారు.

By:  M Prashanth   |   12 Dec 2025 8:00 PM IST
పాపరాజీలు ఫ్రీగానే వస్తారా? ఈ విషయం తెలుసా?
X

బాలీవుడ్ పాపరాజీలు గురించి అందరికీ తెలిసిందే. బీటౌన్ తారల వ్యక్తిగత జీవితాలు, ఫ్యాషన్, కొత్త ప్రాజెక్ట్‌ ల గురించి అభిమానులకు తెలియజేయడంలో ఎప్పుడూ వారంతా కీలక పాత్ర పోషిస్తారు. ఒకప్పుడు తక్కువగా కనిపించిన పాపరాజీలు.. ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన భాగంగా మారారని చెప్పాలి.

ముఖ్యంగా బాలీవుడ్ పాపరాజీలు ఎయిర్‌ పోర్ట్‌ లు, కేఫ్‌ లు, పార్టీల వంటి చోట్ల నటీనటులను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా కనబడడమే లేటు.. వెంటనే కెమెరాలతో క్లిక్ కొట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. అయితే సెలబ్రిటీలు కూడా ప్రమోషన్స్ కోసం వారిని యూజ్ చేసుకుంటారని చెప్పాలి.

ఏదన్నా సినిమా విడుదలైనప్పుడు లేదా ఈవెంట్ జరిగినప్పుడు.. తమను తాము మార్కెట్ చేసుకోవడానికి పాపరాజీలను అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉపయోగించుకుంటున్నారు. కొందరు పాపరాజీలకు డబ్బులు కూడా చెల్లించి.. ప్రత్యేకంగా పిలిపించుకుంటారని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు అది నిజమేనని హీరోయిన్ ప్రియమణి తెలిపారు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాపరాజీలను విమానాశ్రయాలు, కేఫ్‌ లు, ప్రమోషనల్ ఈవెంట్‌ లకు పిలిచి తమను పిక్స్ ద్వారా కవర్ చేయమని వారికి డబ్బులు చెల్లిస్తారని తెలిపారు. అంతకుముందు.. బీటౌన్ సినీ ఇండస్ట్రీలో పాప్ లు ఒక ముఖ్యమైన భాగమని నటి హ్యూమా ఖురేషీ చెప్పారు.

అందుకే వారితో హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేయాలని అభిప్రాయపడ్డారు. స్టార్లు తమ సినిమాలను ప్రచారం చేయాల్సిన సందర్భాలు ఎప్పుడూ ఉంటాయని, అందుకే పాప్స్ ను ఇన్వైట్ చేస్తారని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా, తాము వారిని పిలుస్తామని చెప్పారు. అందుకే తాను వారిపై ఎలాంటి నిందలు వేయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.

10-12 ఏళ్ల కెరీర్‌ లో తాను ఎల్లప్పుడూ పాపరాజీలతో హెల్తీ రిలేషన్ నే మెయింటైన్ చేసినట్లు తెలిపారు. ఒక్కోసారి.. తానే పిక్స్ తీయవద్దని అడుగుతుంటానని చెప్పారు. అప్పుడు వారు అందుకు ఓకే చెప్పి.. ఫోటోలు తీయరని పేర్కొన్నారు. అనేక మంది సెలబ్రిటీలు తమ జీవితంలోని కొన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి పాప్‌ లను కచ్చితంగా ఉపయోగిస్తారని ఆమె అన్నారు.