Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ల వెనుక ఉన్న అసలైన ఫిట్‌నెస్ యుద్ధం

కేవలం అందం కోసం మాత్రమే కాదు, థైరాయిడ్, PCOD వంటి మొండి రోగాలను జయించి వారు ఎలా నిలబడ్డారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఆ వివరాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   15 May 2026 4:00 AM IST
బాలీవుడ్ స్టార్ల వెనుక ఉన్న అసలైన ఫిట్‌నెస్ యుద్ధం
X

బాలీవుడ్ స్టార్స్ అంటే మనకు మెరిసే మేని ఛాయ, పర్ఫెక్ట్ బాడీలే కనిపిస్తాయి. కానీ ఆ సిక్స్ ప్యాక్ వెనుక, ఆ సన్నజాజి నడుము వెనుక వారు చేసే యుద్ధం ఎవరికీ తెలియదు. వయసుతో పనిలేకుండా షారుఖ్, కరణ్ జోహార్ వంటి వారు ఫిట్‌నెస్‌లో యువ హీరోలకే సవాల్ విసురుతున్నారు. కేవలం అందం కోసం మాత్రమే కాదు, థైరాయిడ్, PCOD వంటి మొండి రోగాలను జయించి వారు ఎలా నిలబడ్డారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఆ వివరాలు చూద్దాం..

వయసు కేవలం అంకె మాత్రమే:

సాధారణంగా 50 ఏళ్లు దాటితే "ఇక మనవల్ల ఏమవుతుందిలే" అని చాలామంది ఫిట్‌నెస్‌ను వదిలేస్తారు. కానీ షారుఖ్ ఖాన్ (58), కరణ్ జోహార్ (52) దీనిని తప్పు అని నిరూపించారు. 50ల్లో కూడా సిక్స్ ప్యాక్ సాధ్యమేనని, బాడీని యంగ్‌గా ఉంచుకోవచ్చని వీరు చూపిస్తున్నారు. ఇక కరణ్ జోహార్ అయితే ఎటువంటి షార్ట్‌కట్ మందులు వాడకుండా, తన థైరాయిడ్ సమస్యను నియంత్రించుకుంటూ ఫిట్‌గా మారడం విశేషం.

హార్మోన్లతో సారా అలీ ఖాన్ పోరాటం:

సారా అలీ ఖాన్ ఒకప్పుడు 96 కిలోల బరువు ఉండేది. ఆమె బరువు తగ్గడం అనేది కేవలం తిండి మానేయడం వల్ల జరిగింది కాదు. ఆమె PCOD వంటి తీవ్రమైన హార్మోన్ల సమస్యతో పోరాడింది. హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు బరువు తగ్గడం అనేది ఒక మెడికల్ ఛాలెంజ్. కానీ క్రమశిక్షణ ఉంటే ఆ అనారోగ్యాన్ని కూడా జయించి స్లిమ్‌గా మారవచ్చని సారా నిరూపించింది.

కార్తీక్ ఆర్యన్: అథ్లెట్ లాంటి డిసిప్లిన్:

హీరో కార్తీక్ ఆర్యన్ తన బాడీని కేవలం కండరాల కోసం మాత్రమే మార్చుకోలేదు. ఒక పారాలింపిక్ ఛాంపియన్ పాత్ర కోసం ఆయన బాక్సింగ్, స్విమ్మింగ్ నేర్చుకుని తన జీవనశైలినే మార్చుకున్నాడు. ఇక ఇక్కడ కండరాలు పెరగడం కంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ లాంటి మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవడం ఆయన సాధించిన అతిపెద్ద విజయం.

భూమి పెడ్నేకర్ మానసిక పరిపక్వత:

ఒక సినిమా కోసం 30 కిలోల బరువు పెరగడం, మళ్లీ అంతే వేగంగా తగ్గడం అనేది భూమి పెడ్నేకర్ చేసిన సాహసం. ఇక శరీర ఆకృతి మారుతున్నప్పుడు సమాజం చేసే కామెంట్లను తట్టుకోవడం, మానసిక ఒత్తిడిని జయించడం ఆమెకే చెల్లింది. ఇక బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరానికే కాదు, మెదడుకు కూడా ఒక పెద్ద పరీక్ష లాంటిదని ఆమె నిరూపించింది.

ఈ స్టార్ల ఫిట్‌నెస్ కథలు మనకు ఇచ్చే సందేశం ఒక్కటే.. ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లడం కాదు, మన శరీరంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోవడం. ఇక సరైన ఆహారం, నిరంతర శ్రమ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సూపర్ ఫిట్‌గా మారవచ్చు అన్నది ఇప్పుడు స్టార్స్ నిరూపిస్తున్నారు..