సీతమ్మ ఎగ్జిట్ తో యామీ గౌతమ్ సీన్లోకి!
బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ . రాయ్ ధనుష్, కృతి సనన్ జంటగా `తేరే ఇష్క్ మే` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Oct 2025 3:00 PM ISTబాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ . రాయ్ ధనుష్, కృతి సనన్ జంటగా 'తేరే ఇష్క్ మే' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `ఆత్రాంగిరే` తర్వాత ధనుష్ తో ఆనంద్ తెరక్కిస్తోన్న మరో చిత్రం కావడంతో? ఈరేంజ్ బజ్ క్రియేట్ అవుతోంది. `గుడ్ లక్ జెర్రీ`, `రక్షాబంధన్` లాంటి సినిమాల వైఫల్యం తర్వాత ఆనంద్ ఎల్ . రాయ్ నుంచి రిలీజ్ అవుతోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే మార్కెట్లో బజ్ నెలకొంది.
కాగా ఈ సినిమా సెట్స్ ఉండగానే ఆనంద్ మరో ప్రాజెక్ట్ కూడా సెట్ చేస్తున్నారు. `నయి నవేలీ` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారతీయ జానపద కథలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హారర్ కామెడీ కథగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా కృతిసనన్ ఎంపికైంది. `తేరే ఇష్క్ మే`లో కృతి పెర్పార్మెన్స్ చూసి మరోసారి హీరోయిన్ ఛాన్స్ తనకే ఇచ్చాడు ఆనంద్. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి కృతిసనన్ అనూహ్యంగా తప్పుకుంది.
ఆమె ఎందుకు ఎగ్జిట్ అయిందన్నది తెలియదు గానీ ..మరో ఆలోచన లేకుండా రాయ్ అదే పాత్రకు యామీ గౌతమ్ ని ఎంపిక చేసారు. కృతి కంటే ఇప్పుడా పాత్రకు యామీ పర్పెక్ట్ గా సూటవుతుందని చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో కృతిసనన్- ఆనంద్ ఎల్ రాయ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏవైనా తలెత్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు కారణం ఏంటి? అన్నది తెలియాలి.
ఈ ఏడాది చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని రాయ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇంతలోనే కృతి సనన్ తప్పుకోవడం..ఆమె స్థానంలోకి యామీ గౌతమ్ రావడం అంతా వేగంగా జరిగిపోయాయి. ప్రస్తుతం యామీ సక్సెస్ పరంగా మంచి స్వింగ్ లో ఉంది. `ఆర్టికల్ 370`, `ఓఎమ్ జీ 2` లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిం చింది. త్వరలో `హక్` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతలోనే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం ఒడిసి పట్టుకుంది.
