సూపర్ హీరో చిత్రంలో పాన్ ఇండియా స్టార్!
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి . ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం.
By: Srikanth Kontham | 13 May 2026 7:00 PM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంగతి తన తరహా హీరోలు అంతా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతే? తానెప్పడు ఆరికార్డును చేధిస్తానని కసిగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే `మాతృభూమి` టైటిల్ తో గ్వాల్వానా లోయ ఘటన నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది గనుక క్లిక్ అయితే? 1000 కోట్లు అన్నది సల్మాన్ ఇమేజ్ కు పెద్ద విషయం కాదు. సునాయాసంగా ఆ మార్క్ ను అందుకుం టారు. ఒకవేళ ఫలితం తాను అనుకున్న విధంగా రాకపోతే? పరిస్థితి ఏంటి ? అన్నది దృష్టిలో పెట్టుకుని ప్లాన్ బీని కూడా సిద్దం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఓ భారీ బడ్జెట్ సూపర్ హీరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి . ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. సాధారణంగా సల్మాన్ ఖాన్ సినిమాలంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఆయన ఓ సూపర్ హీరో పాత్రలో కనిపిస్తే? ఆ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. హాలీవుడ్‌లో మార్వెల్, డిసి చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారతీయ నేపథ్యంతో కూడిన ఓ సరికొత్త సూపర్ హీరో ప్రపంచాన్ని సల్మాన్ కోసం సృష్టించే పనిలో దర్శకులు ఉన్నారట.
ఈ సినిమాలో సల్మాన్ తనదైన శైలిలో అన్యాయాన్ని ఎదిరించే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న మరో పాయింట్ కాస్టింగ్. సల్మాన్ సరసన కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారు? అలాగే ఆయనను ఎదుర్కొనే శక్తివంతమైన విలన్ పాత్రలో ఏ అగ్ర హీరో కనిపిస్తారు? అనే అంశాలపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ పాన్ ఇండియా స్టార్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. భారీ కాస్టింగ్ గనుక వర్కవుట్ అయితే భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.
సల్మాన్ ఖాన్ ఇప్పటికే `ఏక్ థా టైగర్`, `సుల్తాన్` వంటి చిత్రాలతో ఫిజికల్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. అయితే సూపర్ హీరోగా మారడం కోసం ఆయన మరింత ప్రత్యేకమైన శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతికతను వాడనున్నారని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దించ బోతున్నారని తెలుస్తోంది. సల్మాన్ గత సినిమాల కంటే భిన్నంగా అత్యంత స్టైలిష్‌గా ఈ చిత్రంలో కనిపించ బోతున్నారని సమాచారం.
ఓవైపు సీక్వెల్ చిత్రాలు, మరోవైపు రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్ ఇలాంటి ప్రయోగాత్మక సబ్జెక్టును ఎంచు కోవడం అభిమానులకు పండగ లాంటి వార్తనే చెప్పాలి. సల్మాన్ మాస్ హీరోగానే కాదు. చిన్నారులను కూడా ఆకట్టుకునే హీరో కూడా. ఈ నేపథ్యంలో ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ పెద్దలు సహా పిల్లలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో కూడిన స్క్రిప్ట్‌ను రాజ్ అండ్ డీకే లాక్ చేసినట్లు తెలుస్తోంది.
