Begin typing your search above and press return to search.

బోయ్‌ఫ్రెండ్ మ్యాట‌ర్‌లో దాప‌రికం లేని యంగ్ హీరోయిన్‌లు

బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాలను.. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలను అత్యంత రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించేవారు.

By:  Sivaji Kontham   |   22 Jun 2026 8:30 AM IST
బోయ్‌ఫ్రెండ్ మ్యాట‌ర్‌లో దాప‌రికం లేని యంగ్ హీరోయిన్‌లు
X

బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాలను.. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలను అత్యంత రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. పెళ్లి లేదా ఎంగేజ్‌మెంట్ వరకు తమ రిలేషన్‌షిప్స్ గురించి నోరు విప్పేవారు కాదు. క‌నీసం కొన్ని నెల‌లు లేదా సంవ‌త్స‌రాలు ర‌హ‌స్యంగా దాగి ఉండేవి. కానీ నేటి తరం యంగ్ హీరోయిన్లు ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికారు. తమ లవ్ లైఫ్, బోయ్‌ఫ్రెండ్స్ విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా... అత్యంత బోల్డ్‌గా .. ఓపెన్‌గా ఉంటూ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో దాచడం కంటే.. తాము ఎవరితో ప్రేమలో ఉన్నామో బహిరంగంగానే చూపించ‌డ‌మే బెట‌ర్ అని ఫీల‌వుతున్నారు.

ఈ జాబితాలో అందరికంటే ముందు వరుసలో నిలుస్తుంది అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో జాన్వీ ఎప్పుడూ దాపరికం లేకుండా ఓపెన్‌గానే ఉంటోంది. జాన్వీ స్నేహాల‌కు బోనీ కూడా అడ్డు చెప్ప‌డం లేదు. శిఖ‌ర్ త‌మ కుటుంబంతో క‌లిసి ఉంటే చాలా ఆనందంగా ఉంటుంద‌ని ఆయ‌న బ‌హిరంగంగానే అంగీక‌రించారు. జాన్వీ-శిఖ‌ర్ ఇద్దరూ కలిసి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లడం, విదేశీ వెకేషన్లలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజాగా జాన్వీ ధరించిన ఒక నైట్ టీషర్ట్‌పై `తప్పిపోతే దయచేసి శిఖర్ వద్దకు తీసుకెళ్లండి` అని రాసి ఉన్న క్యాప్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇది చూసాక‌.. ఈ యంగ్ పెయిర్ ఒక‌రంటే ఒక‌రు ప‌డిచ‌స్తారు.. అందుకే తొంద‌ర‌గా పెళ్లి చేసుకుంటే బావుంటుంద‌ని సెలవిస్తున్నారు నెటిజ‌నులు.

మరో యంగ్ బ్యూటీ బుల్లితెర న‌టి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ కూడా తన ప్రేమ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో పాలక్ బహిరంగంగా షికార్లు చేస్తూ అతడితో అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. వీరిద్దరూ కలిసి సైఫ్ ఇంట్లోనే పలు ఈవెంట్లలో... పార్టీలలో జంటగా కనిపిస్తూ కెమెరాలకు చిక్కుతున్నారు. అయితే పాలక్ తివారీ తండ్రి (శ్వేతా మాజీ భ‌ర్త‌) మాత్రం ఈ స్నేహాలను, ప్రేమాయణాలను తీవ్రంగా విభేధిస్తున్నట్లు సమాచారం. ముందుగా ప్రేమ కన్నా కెరీర్ ముఖ్యం అని.. సినిమాల్లో నిలదొక్కుకోవడంపైనే పూర్తి దృష్టి సారించాలంటూ ఆయన పాలక్‌కు గట్టిగానే క్లాస్ తీసుకోవ‌డంపై చ‌ర్చ సాగుతోంది.

ఇక గ్లామర్ భామలు తారా సుతారియా, అనన్యా పాండే సైతం తమ బోయ్‌ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ దాపరికం లేకుండా ఓపెన్‌గా ఉంటూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. వారు ఎవరితో డేటింగ్‌లో ఉన్నారనే విషయాన్ని దాచకుండా అటు ఇంటర్వ్యూలలో, ఇటు సోషల్ మీడియా పోస్టులలో చాలా క్యాజువల్‌గా ప్ర‌తిదీ చెప్పేస్తుంటారు. ఇటీవ‌లే బ్రేక‌ప్ లు అయ్యాక ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ సింగిల్ స్టాట‌స్ ని ఆస్వాధిస్తున్నారు. వీరికి తోడు సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సైతం ఇటీవల సినిమా రచయిత రాహుల్ మోడీతో ప్రేమాయణం సాగిస్తుండటం బాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. ఈ జంట కూడా ఎక్కడా లుకలుకలు లేకుండా తమ రిలేషన్‌ను హుందాగా ముందుకు తీసుకెళ్తోంది.

వీరందరిలా కాకుండా కాస్త భిన్నమైన శైలిని అవలంబిస్తోంది స్టార్ హీరోయిన్ కృతి సనన్. కృతి కొన్నేళ్లుగా తన బోయ్‌ఫ్రెండ్‌ను ప్రపంచానికి నేరుగా పరిచయం చేయకుండా దాచేస్తున్నా.. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని క్రేజీ లీకులు ఇస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. లండ‌న్ బిజినెస్ మేన్ క‌బీర్ బాహియాతో షికార్లు చేస్తున్నా కేవ‌లం లీకుల‌తో స‌రిపెడుతోంది. మొత్తానికి నేటి తరం హీరోయిన్లు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ... కెరీర్‌తో పాటు తమ లవ్ లైఫ్‌ను కూడా ఎలాంటి మొహమాటాలు లేకుండా ఎంజాయ్ చేస్తూ సరికొత్త యూత్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు.