ప్రియురాలి కోసం గోడకు తల బాదుకునేవాడు
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ గా పాపులరైన ఈ హీరో తన ప్రియురాలి కోసం ఒక్కోసారి గోడకు తలను బాదుకునేవాడు.
By: Sivaji Kontham | 18 Sept 2025 11:31 AM ISTతాను అమితంగా ప్రేమించే ప్రియురాలు తనను విస్మరించిందంటే ఆ బాధను తట్టుకోవడం కొందరికి అంత సులువు కాదు. కొందరు లోలోన మదనపడతారు. మరికొందరు విరుచుకుపడతారు. ఒక్కోసారి తమను తాము హింసించుకునేందుకు, గోడకు తల బాదుకునేందుకు కూడా వెనకాడరు. అలాంటి పిచ్చి ప్రేమ కారణంగా ప్రముఖ నటుడు తన జీవితంలో ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని కోల్పోవడమే గాక, జీవితంలో ఎప్పటికీ భార్యను పొందలేకపోయాడు. స్థిరమైన కుటుంబ బంధాన్ని పెంపొందించలేకపోయాడు.
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ గా పాపులరైన ఈ హీరో తన ప్రియురాలి కోసం ఒక్కోసారి గోడకు తలను బాదుకునేవాడు. అతడి పిచ్చి ప్రేమను ఆ ప్రేయసి భరించలేకపోయేది. చివరికి తన తల్లి కుటుంబ సభ్యులకు కూడా అది హింసగా మారేది. ఎలాగైనా అతడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సదరు నటీమణితో పాటు, కుటుంబ సభ్యులు కూడా భావించేవారు.
అతడు టూమచ్ అబ్సెసివ్.. ఫిజికల్‌గా బాధించుకుంటాడు. తనను తాను హింసించుకునే స్వభావం కలవాడు. అందుకే ఇదంతా చూడలేక అతడిని వదిలేయాలని సదరు నటీమణి నిర్ణయించుకుంది. అలా అతడితో అనుబంధం ముగిసాక కూడా అతడు దాని నుంచి కోలుకోవడానికి కొన్ని ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటికీ అతడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోవడానికి కారణం తన జీవితం నుంచి ఆమె దూరమవ్వడమేనని కూడా చెబుతారు. ఇప్పుడు ఎవరైనా తనను పెళ్లాడమని సూచిస్తే, ఈ వయసులో ఇంకా ఎందుకు? అని ప్రశ్నిస్తున్నాడు. ఆమెపై పిచ్చి ప్రేమ కారణంగా తనను ఇష్టపడిన చాలా మంది కథానాయికలను కూడా అతడు దూరం పెట్టడం కొసమెరుపు. కానీ ఈ విషయాలేవీ బయట పెద్దగా చర్చకు రాలేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 60 ప్లస్ వయసులో అతడు ఇంకా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల సరైన బ్లాక్ బస్టర్ లేక నిరాశగా ఉన్నాడు. రాబోవు దేశభక్తి డ్రామా సినిమాలో అతడు సరిహద్దుల్లో విరోచితంగా పోరాడే సైనికుడిగా కనిపించబోతున్నాడు.
