104 డిగ్రీల జ్వరంతోనూ స్టార్ హీరో సెట్స్ కి!
అగ్ర కథానాయకులు సినిమాల కోసం చూపే అంకితభావం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. సమయపాలనకు, క్రమశిక్షణకు మారుపేరైన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వృత్తినిబద్ధత గురించి పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటారు.
By: Srikanth Kontham | 25 Jun 2026 12:42 PM ISTఅగ్ర కథానాయకులు సినిమాల కోసం చూపే అంకితభావం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. సమయపాలనకు, క్రమశిక్షణకు మారుపేరైన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వృత్తినిబద్ధత గురించి పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటారు. తాజాగా భోజ్‌పురి నటి అక్షరా సింగ్ ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. ఇది అక్షయ్ కుమార్ కు సినిమా పట్ల ఉన్న పట్టుదలను మరోసారి చాటి చెప్పింది. అక్షరా సింగ్ ఏమన్నారంటే? `ఘిస్ ఘిస్ ఘిస్` అనే ప్రత్యేక గీతం షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.
ఆయనకు ఏకంగా 104 డిగ్రీల తీవ్ర జ్వరం ఉంది. అయినా షూటింగ్‌ను ఆపడానికి నిరాకరించారు. ఒకవేళ షూటింగ్ వాయిదా పడితే ప్రొడక్షన్ హౌస్‌కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వందలాది మంది కార్మికుల సమయం వృధా అవుతుందని భావించి ఆయన అలాగే ముందుకు సాగారు.సెట్స్‌లో అక్షయ్ కుమార్ ప్రవర్తించిన తీరును చూసి ఆశ్చర్యపోయానని అక్షరా సింగ్ పేర్కొన్నారు. కెమెరా వెనుక ఎంతో నీరసంగా వణుకుతూ కనిపించిన అక్షయ్ దర్శకుడు యాక్షన్ అనగానే పూర్తి భిన్నంగా మారిపోయేవారని చెప్పారు. తీవ్ర జ్వరంలోనూ ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా, డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా చేస్తూ పాటను పూర్తి చేశారని, ఆయనలోని ఆ ఉత్సాహం సెట్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిందని కొనియాడారు.
ఎంత పెద్ద స్టార్ అయినా? తన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదనే ఆయన ఆలోచనా విధానమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని అక్షరా సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అక్షయ్ కుమార్ ఏడాదికి నాలుగు నుండి ఐదు సినిమాలు పూర్తి చేస్తూ అత్యంత బిజీగా ఉంటారు. ఆయన ఉదయాన్నే నిద్రలేవడం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం వల్లే ఇలాంటి శారీరక సవాళ్లను సైతం తట్టుకోగలుగుతున్నారని పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. పరిశ్రమలోని అగ్ర నటులు ఇలాంటి అంకితభావాన్ని ప్రదర్శించినప్పుడు అది తోటి నటీనటులకు .. సాంకేతిక నిపుణులకు గొప్ప బెంచ్‌మార్క్‌గా మారుతుంది.
అక్షరా సింగ్ వంటి యువ నటీమణులు ఇలాంటి సీనియర్ నటుల నుండి వృత్తిపరమైన బాధ్యతలను, క్రమశిక్షణను నేర్చుకుంటారని ఈ సంఘటన నిరూపించింది. శారీరక ఇబ్బందులను అధిగమించి కళ కోసం శ్రమించడం అనేది నిజమైన కళాకారుడి లక్షణమని ఈ చర్చల ద్వారా వ్యక్తమవుతోంది. ఈ అంకితభావాన్ని అందరూ అభినందించినప్పటికీ ఇది ఆరోగ్య పరంగా ఎంతవరకు సమంజసమనే చర్చ కూడా తెరపైకి వస్తుంది. వృత్తి పట్ల గౌరవం, ప్రొడక్షన్ బడ్జెట్ రక్షణ వంటివి ముఖ్యమైనప్పటికీ నటీనటులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం శ్రేయస్కరం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అక్షయ్ కుమార్ చూపిన ఈ నిబద్ధత ఆయన అభిమానుల్లో - సినీ వర్గాల్లో ఎప్పటికీ చిరస్మరణీయ సంఘటనగా నిలిచిపోతుంది.
