Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : కొత్త లుక్‌తో కిక్‌ ఇచ్చింది

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండియన్ సినిమాలకు కాస్త దూరం జరిగినట్లు అనిపిస్తున్నా ఆమె రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా ఎప్పుడూ తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది.

By:  Ramesh Palla   |   17 Sept 2025 4:06 PM IST
పిక్‌టాక్ : కొత్త లుక్‌తో కిక్‌ ఇచ్చింది
X

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండియన్ సినిమాలకు కాస్త దూరం జరిగినట్లు అనిపిస్తున్నా ఆమె రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా ఎప్పుడూ తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫోటోలు, ఆ ఫోటోలను ఆమె ఫ్యాన్స్‌ షేర్‌ చేయడం వంటి కారణాల వల్ల ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అందుకే తెలుగులో ఆమె సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా ఆ ఫీలింగ్‌ అనేది లేదు. అయితే అందమైన ఆమె ఫోటోలను చూసిన సమయంలో మాత్రం స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాకపోవడం బాధను కలిగిస్తుంది అంటూ కొందరు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. సీనియర్‌ హీరోలతో కాకుండా యంగ్‌ స్టార్‌ హీరోలతోనూ ఆమె సినిమాలు చేయగల సత్తా ఉన్న నటి, అందం ఉన్న బ్యూటీ అనడంలో సందేహం లేదు.


జీరో సైజ్‌ అందంతో మిల్కీ బ్యూటీ తమన్నా

ఆ మధ్య ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు తెగ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల తమన్నా బ్రేకప్‌ అయింది. అంతే కాకుండా ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు తమన్నా ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు చేసేందుకు ఆసక్తిగా ఉందంటూ పుకార్లు వచ్చాయి. తమన్నా ఎప్పుడూ ప్రేమ వ్యవహారం గురించి, బ్రేకప్‌ గురించి మాట్లాడలేదు. కానీ ఆమె ఎప్పటికప్పుడు తన యొక్క పద్దతిని మార్చుకుంటూనే వచ్చింది. ఆ మధ్య తమన్నా కాస్త బరువు పెరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఫ్యాన్స్‌లో కొందరు ఆ విషయంలో తమన్నా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్‌ కోరుకున్నట్లు జీరో సైజ్ కి వచ్చింది. గతంతో పోల్చితే రెట్టింపు అందంగా తమన్నా కనిపిస్తుంది అంటూ అభిమానులు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తెగ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేయడం తెలిసిందే.


ఐటెం సాంగ్స్‌తో అదరగొడుతున్న తమన్నా

ఇప్పుడు తమన్నా తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి స్టైలిష్ డిజైనర్‌ ఔట్ ఫిట్‌ను ధరించి, లూజ్‌ హెయిర్‌ స్టైల్‌ తో అల్ట్రా మోడ్రన్‌ ఫోజ్‌లు ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది నిజంగానే తమన్నా ఫోటో షూట్‌ అయ్యి ఉంటుందా లేదంటే ఏఐ ద్వారా క్రియేట్‌ చేసి ఉంటారా అంటూ కొందరు అనుమానించేంతగా తమన్నా ఇందులో అందంగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వెండి తెరపై ఈమె ఐటెం సాంగ్స్ చేస్తూ చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు ఈ ఫోటోల్లో అంతకు మించిన అందం ఉంది అంటూ తమన్నాను అభిమానులతో పాటు అంతా కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. సాధారణంగా హీరోయిన్స్ ఒక వయసు వచ్చిన తర్వాత అందం తగ్గుతారు. కానీ తమన్నా విషయంలో అది రివర్స్ అయినట్లుగా ఉంది. తమన్నా అందం ఖచ్చితంగా చాలా పెరిగిందని కామెంట్స్ వస్తున్నాయి



బాలీవుడ్‌లో వరుసగా నాలుగు సినిమాలు

టాప్‌ లెస్‌, క్లీ వేజ్‌ షో చేస్తూ మిల్కీ బ్యూటీ తమన్నా షేర్‌ చేసిన ఈ ఫోటోలు చాలా స్పెషల్‌ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా బరువు తగ్గడంతో పాటు, గతంలో మాదిరిగా చాలా అట్రాక్టివ్‌ మేకోవర్‌ తో కనిపిస్తోంది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే లుక్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలను చాలా మంది షేర్‌ చేస్తున్నారు. తమన్నా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వేలాది మంది ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్న తమన్నా త్వరలోనే తెలుగులోనూ ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్‌ కథలు వరుసగా వస్తున్నప్పటికీ మంచి కథ కోసం తమన్నా వెయిట్‌ చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.