ఎవరు ఈ మాయలేడీ? ఈడీకే చుక్కలు చూపిస్తోంది!
మార్చిలో విచారణ దాటవేసిన తర్వాత సెప్టెంబర్ లో తప్పనిసరిగా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
By: Sivaji Kontham | 16 Sept 2025 4:10 PM ISTమార్చిలో విచారణ దాటవేసిన తర్వాత సెప్టెంబర్ లో తప్పనిసరిగా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ మాయలేడీ చుక్కలు చూపిస్తోంది. ఇంతకుముందు సమన్లు అందుకున్నా తనకు అందనట్టు నటించిందనేది అధికారుల ఆరోపణ. దీంతో ఇప్పుడు మరోసారి కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సదరు నటీమణికి సమన్లు పంపింది. బెట్టింగ్ యాప్ ల కేసులో ఈసారి కూడా 16 సెప్టెంబర్ 2025 నాటి విచారణను దాటవేస్తోందని తెలిసింది. సదరు నటీమణి పదే పదే తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో అధికారులు సీరియస్ గా ఉన్నారని సమాచారం.
సామాన్య మధ్యతరగతి ప్రజల కొంపలు కొల్లేరు చేసే బెట్టింగ్ యాప్ పథకానికి ప్రచారం చేసిన దాదాపు 29 మంది సెలబ్రిటీలపై ఇంతకుముందు ఈడీ కొరడా ఝలిపించిన సంగతి తెలిసిందే. ప్రతి సెలబ్రిటీని ఈడీ విచారించింది. ఈ విచారణలో ప్రకాష్ రాజ్ అంతటి పెద్ద నటుడు కూడా ఉన్నాడు. తాను 2015లో యాప్ కి ప్రచారం చేసినా స్వల్ప వ్యవధి తర్వాత దానిని వదిలేసానని ప్రకాష్ రాజ్ అంగీకరించారు.
ఈ సెప్టెంబర్ మాసంలో మాయ లేడీ విచారణకు సహకరిస్తుందా? లేదా! అంటూ ఈడీ అధికారులు చాలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏదో డౌట్ కొడుతోంది.. ఈసారి కూడా విచారణకు సహకరించడం లేదు అని కూడా కన్ఫామ్ అయిపోయారట. సదరు నటి బాలీవుడ్ కెరీర్ సహా సౌత్ కెరీర్ కూడా ఊస్టింగ్ అయిపోయింది. ఏదో కొద్దిరోజులు ఐటమ్ పాటలు అంటూ హుషారుగా కనిపించినా ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా రావడం లేదు. కానీ బిజీ లైఫ్ అంటూ ఈడీ విచారణకు సదరు నటీమణి స్కిప్ కొట్టడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
