క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సమంత.. ఫ్యాన్స్ ఫిదా!
మునపటి సమంత అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సమంత చాలా క్యూట్ గా ఉండేది. కానీ మయోసైటిస్ వల్ల సమంత శరీరం మొత్తం బలహీనంగా మారిపోయి మొహమంతా వాడిపోయినట్లుగా కనిపించింది.
By: Madhu Reddy | 24 Sept 2025 4:05 PM ISTసమంత రూత్ ప్రభు.. 'ఏమాయ చేసావే' సినిమాతో అందర్నీ మాయ చేసి పడేసింది. ఈ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు సంపాదించింది.. అలా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకొని అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకోవడమే కాదు ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళింది. అలా అక్కినేని వంటి బడా ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్లాక సమంత పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగాయి. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో రాణించిన సమంత పెళ్లైన నాలుగేళ్లకు ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత సినీ కెరీర్ చాలా వరకు నష్టపోయింది.
అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.ఈ వ్యాధి వల్ల చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైంది కూడా. అప్పుడప్పుడు సినిమాలతో పలకరించినప్పటికీ ఆ సినిమాలు ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే వ్యాధి నుండి బయటపడ్డ సమంత మళ్ళీ తన అందంపై కాన్సంట్రేషన్ చేసింది. ఎప్పుడు జిమ్ లోనే గడుపుతూ మునపటి రూపాన్ని తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతుంది. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు అలాగే తాను ప్రమోట్ చేసే ఉత్పత్తులకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత తనకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో సమంత క్యూట్ లుక్ కి చాలా మంది ఫిదా అవుతున్నారు.
మునపటి సమంత అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు సమంత చాలా క్యూట్ గా ఉండేది. కానీ మయోసైటిస్ వల్ల సమంత శరీరం మొత్తం బలహీనంగా మారిపోయి మొహమంతా వాడిపోయినట్లుగా కనిపించింది. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ తన అందంపై కాన్సెంట్రేట్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోస్ తో సమంత మునపటి లుక్ లోకి మారిపోయింది అని కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ ఫొటోస్ లో సమంత పెట్టుకున్న వాచ్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.ప్రత్యేకమైన ట్రాపేజ్డ్ ఆకారంతో ఉండే పియాజెట్ యొక్క సిక్స్టీ జువెలరీ వాచ్ ని సమంత తన చేతికి పెట్టుకుంది. దీని కాస్ట్ దాదాపు 30 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అలా సమంత లుక్ లో అన్నింటికంటే హైలైట్ గా ఆమె చేతికి పెట్టుకున్న వాచ్ నిలిచింది.
సమంత పర్సనల్ విషయానికి వస్తే..ఈ మధ్యకాలంలో తరచూ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి తిరుగుతూ కనిపిస్తోంది. అయితే అతను తన బాయ్ ఫ్రెండ్ అని అఫీషియల్ గా చెప్పడం లేదు.కానీ సమయం దొరికితే చాలు రాజ్ నిడిమోరుతో కలిసి టూర్లు, వెకేషన్ లకు వెళ్లడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఒకే ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా సమంత , రాజ్ ఇద్దరు కలిసి ఒకే జిమ్ నుండి బయటికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. త్వరలోనే రాజ్ నిడిమోరు, సమంతల రెండో పెళ్లి జరగబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
