పిక్‌టాక్ : గోల్డెన్ షాడోలో అందాల రాశి డాన్స్
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో వరుసగా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతోంది.
By: Ramesh Palla | 31 July 2025 11:14 PM ISTఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రాశి ఖన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో టైర్ 2 హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచిన రాశి ఖన్నా కోలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఈ మధ్య కాస్త తక్కువ సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా హిందీ, తమిళ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగులో ఈమె థాంక్యూ సినిమాతో వచ్చింది. ఆ సినిమా నిరాశ పరచడం తో మళ్లీ కనిపించలేదు. అయితే తమిళ్‌లో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈమె నటించిన అఘతియాయా తమిళ మూవీ విడుదలైంది. ఆ సినిమాతో పాటు మరో రెండు తమిళ్ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో రాశి ఖన్నా
ఇక తెలుగులో చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీనిధి శెట్టితో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోనూ రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్‌లో మరోసారి ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అందాల ఫోటోలను షేర్ చేసిన రాశి ఖన్నా
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో వరుసగా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతోంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి ఒక షూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. డాన్స్ చేస్తున్న ఫోటోలను రాశి ఖన్నా షేర్ చేసింది. అందమైన గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్‌తో పాటు, గోల్డెన్ కలర్ లైట్ లో రాశి ఖన్నా మెరిసి పోతుంది. ఇంతటి అందగత్తెకు టాలీవుడ్‌లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆకట్టుకునే అందంతో పాటు, నటనలోనూ మంచి ప్రతిభ కనబర్చే రాశి ఖన్నాకు ఇక ముందు అయినా ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్‌కి జోడీగా జై లవకుశ సినిమాలో రాశి ఖన్నా
హిందీ చిత్రం మద్రాస్ కేఫ్ తో 2013లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఖన్నా 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే ఉత్తమ మహిళ డెబ్యూ తెలుగు నటిగా సైమా అవార్డ్‌ను గెలుచుకుంది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ సినిమాలతో తెలుగులో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ప్రేక్షకుల్లో అభిమానం దక్కించుకుంది. కానీ ఈ అమ్మడికి టాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ నుంచి పెద్దగా స్పందన దక్కలేదు. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్‌తో తప్ప ఈమె మరే స్టార్ హీరోతో నటించలేదు. జై లవకుశ సినిమా తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ ఈ అమ్మడికి ఆ అవకాశాలు రాలేదు.
