రెడ్ డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న గ్లోబల్ స్టార్!
నటనతోనే కాదు గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.
By: Madhu Reddy | 17 Oct 2025 9:41 AM ISTనటనతోనే కాదు గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఒకప్పుడు సౌత్ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైన ఈమె అక్కడ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇబ్బందులు ఎదురవడమే కాకుండా బాలీవుడ్లో అవకాశాలు రాకుండాపోయాయి. దాంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే పలు యాక్షన్ చిత్రాలు చేసి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది ప్రియాంక చోప్రా.. ముఖ్యంగా ఒక్కో సినిమాకు , వెబ్ సిరీస్ కు 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని అబ్బుర పరుస్తోంది ఈ ముద్దుగుమ్మ
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ సినిమా 2027లో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోసం ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు సినిమా షూటింగ్లకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సినిమా లొకేషన్స్ కి సంబంధించిన ఫోటోలనే కాదు ఇప్పుడు తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఈమె.. అందుకు సంబంధించిన ఫోటోలతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. నెట్టెడ్ తో చాలా అందంగా డిజైన్ చేసిన డ్రెస్ ను ధరించి తన అందాలతో మరొకసారి మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. రెడ్ డ్రెస్ ధరించిన ఈమె తన మేని ఛాయతో మరింత అందంగా కనిపిస్తోంది. ఇక తాజాగా ఇలాంటి డ్రెస్ లో అందాలను వలకబోస్తూ రెడ్ మిర్చిలా హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికైతే ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే..1982 జూలై 18జంషడ్ పూర్, ఝార్ఖండ్ లో జన్మించిన ఈమె నటన రంగంలోకి అడుగుపెట్టక ముందే మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది ప్రియాంక చోప్రా. ఈమెకు 2002లో తమిళం మూవీ తమిళన్ అనే చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అలా తమిళ చిత్రాలతో కెరియర్ మొదలుపెట్టిన ఈమె వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికి అయితే ఇప్పుడు తెలుగులో తొలిసారి సినిమా చేస్తోంది మరి ఈ సినిమా ఈమెకు కచ్చితంగా మరింత పాపులారిటీ తెచ్చిపెటుతుందని అందరూ ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఏకంగా రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని.. 1200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
