నయనాల సోయగాలతో అలరారుతున్న బుట్టబొమ్మ!
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీలో పాల్గొని, ఆ తర్వాత 2012లో ముగమూడి అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
By: Madhu Reddy | 29 Dec 2025 9:40 AM ISTప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీలో పాల్గొని, ఆ తర్వాత 2012లో ముగమూడి అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 2014లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో నటించి తన అందంతో నటనతో కుర్ర కారు హృదయాలను దోచుకుంది.అంతేకాదు 2016లో మొహంజోదారో అనే చిత్రంతో హిందీ రంగ ప్రవేశం కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.
2017లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె మరుసటి ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో జిగేలురాణి అనే స్పెషల్ సాంగ్ చేసి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో అనే సినిమాలో బుట్ట బొమ్మ పాత్రతో తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకుంది. అప్పటినుంచి బుట్టబొమ్మగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఈమెకు విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది దేవా , రెట్రో అంటూ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది కానీ ఈ రెండు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. ఇటు రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో మోనిక అనే స్పెషల్ సాంగ్ లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం ఈమెకు కలిసి రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మలేషియాలో ఈ సినిమా ఆడియో లాంచ్ ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ దళపతిని చూడడానికి అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇకపోతే ఈ ఆడియో లాంచ్ లో పూజ హెగ్డే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెడ్ కలర్ సిల్క్ చీర కట్టుకొని తన అందాలతో అక్కడి ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం అదే ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. తన సిల్క్ చీరకు తగ్గట్టుగా హెవీ జువెలరీ ధరించి తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసింది. అలాగే కళ్ళతో మాయ చేస్తూ నయనాల సోయగాలతో అలరారుతోంది. మొత్తానికైతే పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
