Begin typing your search above and press return to search.

పాల‌క్ కొత్త సంవ‌త్స‌రం ట్రీట్ మ‌రో లెవ‌ల్

న‌టవార‌సులంద‌రికీ అవ‌కాశాలు ఉంటాయ‌నుకోవ‌డం పొర‌పాటు. ఆరంభ క‌ష్టాలు ఎవ‌రైనా ఎదుర్కోవాల్సిందే.

By:  Sivaji Kontham   |   12 Jan 2026 12:00 PM IST
పాల‌క్ కొత్త సంవ‌త్స‌రం ట్రీట్ మ‌రో లెవ‌ల్
X

న‌టవార‌సులంద‌రికీ అవ‌కాశాలు ఉంటాయ‌నుకోవ‌డం పొర‌పాటు. ఆరంభ క‌ష్టాలు ఎవ‌రైనా ఎదుర్కోవాల్సిందే. అంద‌రూ `స‌య్యారా` త‌ర‌హా విజ‌యాల్ని అందుకోలేరు కాబ‌ట్టి, ప్రారంభం నిరూపించుకోవ‌డానికి చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. బాలీవుడ్ సీనియర్ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా స్ట్ర‌గుల్ ని ఎదుర్కొంటోంది.





అయితే ఈ బ్యూటీ కొత్త ఏడాదిని చాలా సానుకూలతతో ప్రారంభించారు. జ‌న‌వ‌రి ఆరంభంలో తన సోషల్ మీడియాలో 5th is the new 1st (ఫిఫ్త్ ఈజ్ ది న్యూ ఫ‌స్ట్) అంటూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంత‌లోనే మారిషస్ బీచ్‌లలో దిగిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ ఐకాన్‌గా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంటున్న పాల‌క్ త‌న రూప‌లావ‌ణ్యాన్ని ఎలివేట్ చేస్తున్న తీరు యూత్ ని ఆక‌ర్షిస్తోంది.





తాజాగా మ‌రో అరుదైన ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. పాల‌క్ ఇన్న‌ర్ అంద‌చందాల‌ను ఎలివేట్ చేస్తూ పాక్షికంగా స్ట్రాపీల‌తో రూపొందించిన ఈ డిజైన‌ర్ డ్రెస్ యూత్ ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఐదున్న‌ర అడుగుల డ్యాషింగ్ అమ్మాయి రొమాంటిక్ లుక్ తో గుబులు పెంచుతోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యూనిక్ లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా షేర్ అవుతోంది.





పాలక్ ఇప్పటికే కొన్ని క్రేజీ మ‌ల్టీస్టారర్ల‌లో న‌టించింది. యూత్ లో అభిమానుల‌ను సంపాదించుకుంది. 2026లో ఆమె మరిన్ని చిత్రాలతో మన ముందుకు రాబోతున్నారు. రోజీ: ద సాఫ్రాన్ చాప్టర్ త‌న కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. వివేక్ ఒబెరాయ్, అర్బాజ్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ 2026 లో విడుదలయ్యే అవకాశం ఉంది.





పాల‌క్ సల్మాన్ ఖాన్ చిత్రం `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` (2023) తో ఆమె బాలీవుడ్ వెండితెరకు పరిచయ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది విడుద‌లైన `ది భూత్నీ`లో సంజయ్ దత్, మౌనీ రాయ్ లాంటి సీనియ‌ర్ తార‌ల‌తో క‌లిసి న‌టించింది. రోమియో S3 లో ఠాకూర్ అనూప్ సింగ్‌తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు పాల‌క్ కి యూత్‌లో ఫాలోయింగ్ పెంచాయి.

పాల‌క్ వ్యక్తిగత జీవితం పై ర‌క‌ర‌కాల‌ రూమర్స్ కూడా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ - పాలక్ తివారీ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గత రెండేళ్లుగా బాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అంద‌మైన జంట కలిసి పార్టీలకు వెళ్లడం, విదేశీ ప్రయాణాలు చేయడం వంటివి రూమర్లకు బలం చేకూర్చుతున్నాయి. అయితే వీరిద్దరూ ఇప్పటికీ కేవలం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. అయితే పాల‌క్ డేటింగుల కంటే న‌ట‌న‌పై దృష్టి సారించాల‌ని అభిమానులు సూచిస్తున్నారు.